Ram Charan Birthday Celebrations: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సీనియర్ నటుడు, జనసేన నేత నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
‘ చరణ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా కుటుంబంలో మొట్టమొదటి కుమారుడు అతనే. మా అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి. చిన్నప్పుడు ఎంతో అమాయకంగా ఉండే చరణ్.. వయసు పెరిగేకొద్దీ పరిణతి సాధించాడు. ఇప్పుడు మా అందరి కంటే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించగలుగుతున్నాడు. మా పిల్లల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మా పెద్దల దగ్గరకు రావడం మానేసి చరణ్ ని ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి సమస్యనైనా సున్నితంగా పరిష్కరించగల నేర్పు తనకే ఉంది. చరణ్ లాంటి బిడ్డ మా కుటుంబంలో పుట్టడం మా అదృష్టం. ఈరోజు బాలీవుడ్ మొత్తం తన వైపే చూస్తోంది. ఇది మాకు గర్వకారణం. చరణ్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు
హైపర్ ఆది మాట్లాడుతూ..’ ఒక మనిషిని చూడగానే పదిమంది దండం పెడితే అది మెగాస్టార్ . ఒక మనిషి పదిమందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. తన తండ్రి లాగా భుజం తట్టి ప్రోత్సహించడం తెలుసు. తన బాబాయి లాగా భోజనం పెట్టి సాయం చేయడం తెలుసు. ఈ రెండు లక్షణాలు ఉండబట్టే చరణ్ బాబు మెగా పవర్ స్టార్ అయ్యారు. ఒక సినిమాకి ఆంధ్రా, తెలంగాణలో ఎన్ని వసూళ్లు సాధించిందని మాట్లాడుకొనే స్థాయి నుంచి అమెరికాలో ఎంత వసూలు చేసింది అని మాట్లాడుకునే స్థాయికి మనల్ని తీసుకెళ్లిన ఘనత చరణ్ బాబుదే. ఎంతమంది నైనా నెట్టుకుంటూ వచ్చి నంబర్ వన్ గా నిలబడి కలిగి సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే’ అని అన్నారు.