కోలీవుడ్ నడిగర్ సంఘం ఎన్నికలు మంచి వాడి .. వేడి మీద జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాల మధ్య భీకరపోరు జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతుండడం విశేషం. ప్రస్తుతం ఎన్నికల వేడి మంచి హీటెక్కిస్తోంది. నేడు చెన్నై లో జరిగిన ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని, ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి బందో బస్తును ఏర్పాటు చేసారు. హీరో విశాల్ – దర్శకుడు భాగ్యరాజ్ ప్యానల్స్ మధ్య గట్టి ఫొటో నెలకొంది.
ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మొదలైన ఎన్నికలు సాయంత్రం 5 వరకు జరిగాయి. ఈ రెండు ప్యానెల్స్ మధ్య 317 ఓట్లు ఉన్నాయి. మరి రెండు వర్గాల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయం ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో హీరో విశాల్ కు సపోర్ట్ చేసిన చాలా మంది నటీనటులు .. ఈ సారి ఆయనకు వ్యతిరేకంగా మారడం అందరికి షాకిస్తుంది. ఈ
మద్యే సీనియర్ దర్శకుడు భారతీరాజా విశాల్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు అసలు విశాల్ తమిళోడు కాదు .. తెలుగు వాడంటూ పలు సంచలన కామెంట్స్ చేయడం .. ఆ ఇంపాక్ట్ కూడా విశాల్ పై పడ్డట్టు తెలుస్తోంది. పలువురు తమిళ నటీనటులు విశాల్ తెలుగువాడు కాదన్న దిశగా పలు కామెంట్స్ తో పాటు ప్రచారం చేస్తున్నారట. మరి ఈ ఎన్నికల నేపథ్యంలో విశాల్ ప్యానల్ కు ఈ సారి గట్టి పోటీ ఏర్పడడం ఈ ప్యానల్ ని టెన్షన్ పెడుతుంది. చూద్దాం .. మరి ఎవరు గెలుస్తారో.