పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ రాష్ట్రానికే కాదు దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని అన్నారు.
2019 లో జనసేనకు భవిష్యత్తు ఉందా అనే సందర్భంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చామని అన్నారు. కష్టమైన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుకొన్నాం.. మన నాయకుడిని ఇబ్బంది పెట్టిన రోజులను మర్చిపోలేమని అన్నారు నాదెండ్ల మనోహర్. ఆర్ధికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారు. తనతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరినీ పవన్ గౌరవించారని అన్నారు. జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు నాదెండ్ల మనోహర్.
తాము ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో మరోలా లేమని.. రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్ ఎదగాలని అన్నారు నాదెండ్ల మనోహర్. జనసేన ఎప్పుడూ సామాన్యుల పక్షానే నిలబడుతుందని.. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందేలా జన సైనికులు కృషి చేయాలని అన్నారు నాదెండ్ల మనోహర్. జనసేన పోరాటంలో 463 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పవన్ అండగా ఉన్నారు. మన అడుగులు ఎప్పుడూ సామాన్యుడి వైపే నడుస్తాయని అన్నారు నాదెండ్ల మనోహర్.