తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న గాయాల మచ్చలను దాచుకోకుండా సహజంగా కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఇది ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నభా నటేష్ ఎడమ భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 2022లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో బాధపడినా, ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని తిరిగి ఇండస్ట్రీలో తన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ ఘటన తర్వాత కూడా తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ముందుకు సాగడం ఆమె పట్టుదలని చూపిస్తోంది.
ఇప్పుడు ఈ సమ్మర్ నభా నటేష్ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఆమె నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు Swayambhu మరియు Nagabandham విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న నభా, నటిగా మరో మెట్టు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Nagabandhamలో పార్వతి పాత్రలో, Swayambhuలో సుందరవల్లి అనే యువరాణిగా ఆమె ప్రేక్షకులను అలరించనుంది.
వైవిధ్యమైన కథలతో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు మంచి స్పందన పొందితే, నభా నటేష్ కెరీర్‌కు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన స్టిల్స్‌తోనే ఆమె మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
