America: నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈక్రమంలో కమలా హారిస్ ప్రచారంలో.. అస్కార్ వేదికపై సత్తా చాటిన మన ‘నాటు-నాటు’ పాట భాగం కావడం విశేషం.
ఇండో-అమెరికన్ లీడర్ అజయ్ జైన్ భుటోరియా ‘నాచో-నాచో’ పేరుతో హిందీ పాటను కమలా హారిస్ కు అన్వయిస్తూ రూపొందించిన వీడియోను పోస్ట్ చేశారు. కమలా హారిస్ కు ఓటు వేయాలని భారతీయులు పిలుపునిస్తున్నారు. ఇందులో తెలుగువారూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రచార గీతం హోరెత్తిస్తోంది.
‘అమెరికా ఎన్నికల్లో నాచో-నాచో పాటతో దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీని ఒక్కటి చేయాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 4.4మిలియన్ల ఇండియన్ అమెరిక్ ఓటర్లు, 6మిలియన్ల దక్షిణాసియా ఓటర్లే లక్ష్యంగా కమలా హారిస్ ను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నాం. నాచో-నాచో ఒక ఉద్యమం. అలానే మా ప్రచారాన్నీ కొనసాగిస్తాం. కమలా హారిస్ ను ఉపాధ్యక్షురాలిగా గెలిపించుకున్నాం.. ఇప్పుడు అమెరికా తొలి అధ్యక్షురాలిగా కూడా గెలిపించుకునే సమయం వచ్చింద’ని అన్నారు.