Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం ధియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈక్రమంలో సినిమాలో కొన్ని డైలాగులు కొందరిని టార్గెట్ చేసేలా.. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఫేక్ డైలాగ్స్ సర్క్యులేట్ కావడంపై చిత్ర బృందం స్పందించింది. ఇప్పటికైనా ఇటువంటి నెగటివ్ ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో సృష్టించిన కొన్ని డైలాగులను పుష్ప 2 సినిమాలోనివి అంటూ కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు చేసే నెగటివ్ ప్రచారం ఇప్పటికైనా ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నా’మంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మరోవైపు.. సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. పైరసీ వీడియోలు, లింక్స్ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ చిత్ర బృందం కోరింది. సంబంధిత పైరసీ వీడియోలు కనిపిస్తే.. [email protected] మెయిల్ కు కానీ, 8978650014 నెంబరును కానీ ఫోన్ చేసి వివరాలు తెలపాలని.. వాటిని అడ్డుకుంటామని పేర్కొంది.