Switch to English

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థి ఖరారవ్వాల్సి వుంది. ఇంతకీ, పోటీ చేసేది తెలంగాణ రాష్ట్ర సమితేనా.? ఆ స్థానంలో కొత్తగా పుట్టుకురానున్న జాతీయ పార్టీ పోటీ చేస్తుందా.? ఈ విషయమై ఈ నెల 5న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ స్పష్టతనిస్తారు.

ప్రస్తుతానికైతే రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) బరిలోకి దిగాయి. మూడో పార్టీ.. అది ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అవుతుందా.? ఆ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ (భారత రాష్ట్రీయ సమితి) పోటీలోకి దిగుతుందా.? అన్నది తేలాల్సి వుంది.

ఇదిలా వుంటే, అందరికన్నా ముందు అభ్యర్థిని ప్రకటించింది తామేననీ, నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నామనీ, తమ సీటుని తాము గెలుచుకుంటామనీ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా చాలా కాన్పిడెంట్‌గా కనిపిస్తున్నారు. పైకి ఎంత ధైర్యం, నమ్మకం చూపిస్తున్నా, లోలోపల కాంగ్రెస్ ఖేల్ ఖతం అయ్యిందన్న విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.

బీజేపీ విషయానికొస్తే, దుబ్బాక అలాగే హుజూరాబాద్ నియోజకవర్గాల్లో అమలు చేసిన వ్యూహాన్నే మునుగోడులోనూ అమలు చేసి విజయం సాధించాలన్నది కమలనాథుల వ్యూహం. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంది బీజేపీ. నియోజకవర్గంలో బీజేపీ హంగామా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. ఉప ఎన్నిక నగారా మోగిసింది కాబట్టి, బీజేపీ జాతీయ నాయకులు ఒకరొకరుగా, మరింత ఉధృతంగా మునుగోడులో తిరగబోతున్నారట.

మరి, తెలంగాణ రాష్ట్ర సమితి సంగతేంటి.? ఎలాగైనా గెలిచేస్తాం.. అనే ధీమా నుంచి, తేడా వస్తే ఏంటి పరిస్థితి.? అనే ఆందోళన వరకు.. చిత్ర విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.. అధికార టీఆర్ఎస్. మధ్యలో జాతీయ పార్టీ అన్న హంగామా ఒకటి మొదలయ్యేసరికి, అదేమో కొత్త గందరగోళానికి తెరతీసింది.

‘ముందైతే మునుగోడు మీద ఫోకస్ పెడదాం, ఆ తర్వాత జాతీయ పార్టీ గురించి ఆలోచిద్దాం..’ అన్న అభిప్రాయమే టీఆర్ఎస్‌లో బలంగా వినిపిస్తోంది. అభ్యర్థిని ప్రకటించడంలో చేస్తున్న జాప్యం కొంప ముంచేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది టీఆర్ఎస్‌లో. పైగా, స్థానికంగా నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం టీఆర్ఎస్‌కి ఇబ్బందికరంగా మారింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...