Switch to English

బిగ్‌ షాక్‌: క్రికెట్‌కి ధోనీ గుడ్‌బై.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఇండియన్‌ క్రికెట్‌ ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లను చూసింది. అలా ఓ పది మంది లిస్టు తీస్తే ఖచ్చితంగా అందులో మహేంద్రసింగ్‌ ధోనీ పేరుంటుంది. ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ గొప్ప ఆటగాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ‘ధోనీ సుడిగాడు’ అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్‌. క్రికెట్‌లోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన ధోనీ, అప్పటికీ, ఇప్పటికీ సంచలనాలకి కేరాఫ్‌ అడ్రస్సే. బ్యాట్‌తో గట్టిగా బాదలేకపోతే, వికెట్ల వెనకాల మ్యాజిక్‌ చేసి, జట్టును గెలిపించేస్తాడు. విపత్కర పరిస్థితుల్లో రిస్కీ డెసిషన్‌ తీసేసుకుని మ్యాచ్‌ని గెలిపించేయగలడు. ఆ రిస్క్‌ నూటికి తొంభై ఐదు సార్లూ అతనికి కలిసొచ్చేస్తుంది.

తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ని టీమ్‌ ఇండియా గెలిచింది ధోనీ హయాంలోనే. కపిల్‌ డెవిల్స్‌ తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ సాధించడానికి టీమిండియా చాన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. మళ్లీ ఆ ఘనత ధోనీ హయాంలోనే టీమిండియా సాధించింది. సచిన్‌ టెండూల్కర్‌ లేకపోతే, ఇంకెవరు.? అన్న ప్రశ్నకు కొన్ని ఆప్షన్స్‌ దొరికాయి. సచిన్‌తో పోల్చలేకపోవచ్చు కానీ, షికర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కోహ్లీ ఆ కోవలోకే వస్తారు. అంటే, జట్టుని నిలబెట్టగలరని అర్ధం. కానీ, ధోనీకి రీప్లేస్‌మెంట్‌ ఎక్కడా.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు కాబట్టే, ధోనీ ఈజ్‌ ద బెస్ట్‌. ఇప్పుడీ మహేంద్రుడు క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేస్తున్నాడు.

వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆడే చివరి మ్యాచ్‌ ధోనీకి వన్డే కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ కాబోతోంది. ఇప్పటికే తన రిటైర్మ్‌ంట్‌ గురించి బీసీసీఐకి ధోనీ సమాచారమిచ్చాడట. వికెట్ల వెనకాల మ్యాజిక్‌ చేస్తున్నా, గతంతో పోల్చితే ధోనీలో వేగం తగ్గింది. బ్యాటింగ్‌ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని ధోనీ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. నిజానికి, ఇంకో ఆప్షన్‌ లేకనే, ధోనీతో టీమిండియా వరల్డ్‌ కప్‌ పోటీలకు సన్నద్ధమయ్యింది. ఇప్పటికే టెస్ట్‌ ఫార్మాట్‌ నుండి రిటైర్మ్‌ంట్‌ తీసుకున్న ధోనీ, వన్‌డే, టీ 20 క్రికెట్‌కి కూడా గుడ్‌ బై చెప్పాలనుకోవడం అభిమానులకు మాత్రం రుచించడం లేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....