దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్ సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ మృనాల్ నటించిన సీత పాత్ర గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.
నటనతో పాటు అందంగా కనిపించే వరకు అన్ని విషయాల్లో కూడా మృనాల్ ను ఒక అద్భుతం అన్నట్లుగా దర్శకుడు హను రాఘవపూడి చూపించాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గతంలో అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠిని ఎలా అయితే చూపించాడో అలాగే మృనాల్ ను చూపించాడు. కనుక ముందు ముందు రోజుల్లో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మృనాల్ మారిపోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే మృనాల్ ను నిర్మాతలు సంప్రదించడం మొదలు అయ్యి ఉంటుంది.