Switch to English

మిస్టర్ అండ్ మిస్ మూవీ రివ్యూ: రొమాంటిక్ సీన్స్ ఓకే, మిగతా అంతా లైట్.!

Critic Rating
( 1.75 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie మిస్టర్ అండ్ మిస్
Star Cast శైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి
Director అశోక్ రెడ్డి
Producer క్రౌడ్ ఫండెడ్ సినిమా
Music యశ్వంత్ నాగ్
Run Time 2 గంటల 5 నిముషాలు
Release జనవరి 29, 2021

‘ఓ స్త్రీ రేపు రా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశోక్ రెడ్డి దర్శకత్వంలో నూతన నటీనటులు శైలేష్ సన్నీ – జ్ఞానేశ్వరి పరిచయమవుతూ క్రౌడ్ ఫండెడ్ సినిమాగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్‘. టీనేజ్ లవ్ స్టోరీగా, రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడం వలన ‘ఏ’ సర్టిఫికెట్ తో రిలీజైన ఈ సినిమా యువతను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న బలవంతం మీద శివ(శైలేష్ సన్నీ) సాఫ్ట్ వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ శివలో విషయం ఉన్నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో వీక్ అవ్వడం వలన జాబ్ రాదు. అలా వెళ్లిన ఒక ఇంటర్వ్యూలో హెచ్.ఆర్ అయిన శశి(జ్ఞానేశ్వరి) అతని టాలెంట్ ని చూసి, 15 రోజుల్లో ఇంగ్లీష్ బెటర్ చేసుకుంటే జాబ్ ఇస్తానని ఒక ఛాన్స్ ఇస్తుంది. అక్కడి నుంచి డెవలప్ అయిన వారి పరిచయం ప్రేమగా మారి, ఒకే అపార్ట్ మెంట్ లో లివిన్ రిలేషన్ షిప్ లో ఉండే స్థాయి వరకూ వస్తారు. ఒక సంవత్సరం తర్వాత ఇద్దరికీ సెట్ అవ్వక విడిపోదాం అనుకునే టైంలో శివ ఫోన్ కనపడకుండా పోతుంది. ఆ ఫోన్ లో వాళ్ళ ప్రైవేట్ మోమెంట్స్ కి సంబందించిన వీడియో ఉండడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఆ ఫోన్ ని వెతకడం కోసం వాళ్ళు పడ్డ ఇబ్బందులేమిటి? ఫోన్ దొరికిందా లేక అందులోని ప్రైవేట్ వీడియో బయటకి వచ్చేసిందా? ఫోన్ ని వెతికే జర్నీలో మళ్ళీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా? లేక చివరికి విడిపోయారా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ముందుగా తెరపై కనిపించిన హీరో హీరోయిన్ – శైలేష్ సన్నీ అండ్ జ్ఞానేశ్వరిలకి ఇది మొదటి సినిమా. కానీ మొదటి సినిమా అని తెలియకుండా ఇచ్చిన పాత్రల్లో ఇద్దరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో జ్ఞానేశ్వరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం వలన సూపర్బ్ పెర్ఫార్మన్స్ తో ఎక్కువ మార్క్స్ కొట్టేస్తే, సెకండాఫ్ లో శైలేష్ మార్క్స్ కొట్టేస్తాడు. ఇద్దరికీ ప్రేమ, కోపం, బాధ లాంటి ఎమోషన్స్ చూపించే సీన్స్ ఉండడం, అందులో ఇద్దరూ బాగా చేయడం సినిమాకి కొంత ప్లస్ అని చెప్పాలి. అలాగే జ్ఞానేశ్వరి అందాలు, రొమాంటిక్ సీన్స్ వలన యువతకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో ఫ్రెండ్ బుల్లెబ్బాయ్ పాత్రలో చేసిన నటుడు ఫస్ట్ హాఫ్ లో వన్ లైనర్స్ తో కొంత నవ్విస్తాడు.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ టీంలో ఈ సినిమాకి టాప్ 3 ర్యాంకింగ్ ఇస్తే టాప్ ప్లేస్ లో మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ ఉంటారు. సినిమాలో తన పాటలు సందర్భానుసారంగా బాగుంటే, నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాలో మూడ్ ని బాగా క్యారీ చేసాడు. ఆ తర్వాత సిద్ధం మనోహర్ విజువల్స్ బాగున్నాయి. యూత్ ఫుల్ ఫీల్ ని బాగా క్యారీ చేసాడు. ఇక చివరిగా యలమంచిలి కరిష్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సుధీర్ వర్మ డైలాగ్స్ చూస్తే నార్మల్ సీన్స్ లో ఓకే అనిపిస్తాయి కానీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం డెప్త్, ఫీల్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఇతను అందించిన స్క్రీన్ ప్లే అయితే బిగ్గెస్ట్ మైనస్ గా చెప్పుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా మీరు గెస్ చేయని సీన్ ఏదీ ఉండదు. సో బాగా బోరింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. కార్తిక్ కట్స్ ఎడిటింగ్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేదు. బహుశా లెంగ్త్ తగ్గించాలని చూడడం వలన అనుకుంటా మేజర్ ఎమోషనల్ సీన్స్ లో పూర్తి జంప్ కట్స్ కనిపిస్తాయి. అందుకే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు.

ఇక కథ – ఇనీషియల్ స్క్రీన్ ప్లే – డైరెక్షన్ బాధ్యతలు వహించిన అశోక్ రెడ్డి విషయానికి వస్తే.. ఎన్నో సార్లు చూసేసిన, తీసిన ప్రేమ కథనే ఈయన తీసుకున్నారు. ఆయన షార్ట్ ఫిలింగా తీసి అవార్డు అందుకున్న పాయింట్ ని సినిమాగా తీశారు. షార్ట్ ఫిలిం కంటెంట్ కి పర్ఫెక్ట్ కాబట్టి అక్కడ హిట్ అయ్యింది ఇక్కడ మిస్ ఫైర్ అయ్యింది. ఫైనల్ స్క్రీన్ ప్లే నే చాలా బోరింగ్ అంటే ఇక ఇనీషియల్ స్క్రీన్ ప్లే ఎంత బ్యాడ్ అనేది చెప్పక్కర్లేదనుకుంటా.. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే.. నటీనటుల చేత పెర్ఫార్మన్స్ లు చేయించడం వరకూ ఒక 70% క్రెడిట్ ఇవ్వచ్చు, కానీ సినిమాగా చూసుకుంటే, లెంగ్త్ విషయం కావచ్చు, లేదా ఇతరులు ఇచ్చిన సలహాల మేరకు అవ్వచ్చు సినిమాని 125 నిమిషాలకి కట్ చేశారు ఓకే, కానీ ఎంత కట్ చేసినా సినిమాలో తాను అనుకున్న ఎమోషన్, చెప్పాలనుకున్న మెసేజ్ మిస్ కాకుండా ఉండాలి. కానీ అదే మిస్ అవ్వడం వలన ఫస్ట్ హాఫ్ పవరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పి ఏటేటో వెళ్ళిపోయి ఆడియన్స్ కి చిరాకు తెప్పించేస్తుంది. క్రౌడ్ ఫండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

–  యూత్ ని అట్రాక్ట్ చేసే బోల్డ్ రొమాంటిక్ సీన్స్
–  శైలేష్ సన్నీ – జ్ఞానేశ్వరి నటన
– మొదటి 30 నిమిషాలు

బోరింగ్ మోమెంట్స్:

– అదే రొటీన్ లవ్ స్టోరీ
– బోరింగ్ కథనం
– ఇర్రిటేట్ చేసే సెకండాఫ్ నెరేషన్
– ప్రేమ కథలో ఎమోషన్స్ మిస్ అవ్వడం
– వీక్ డైరెక్షన్
– ఎడిటింగ్
– ఫన్ కూడా మిస్ అవ్వడం
– 125 నిమిషాలే అయినా 4 గంటల సినిమా అనే ఫీల్ రావడం

విశ్లేషణ:

‘మిస్టర్ అండ్ మిస్’ అనే సినిమా ‘ఏ’ సర్టిఫికెట్ తో యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన సినిమా.. అనుకున్నట్టే కథ పాత చింతకాయ పచ్చడి అయినా, యూత్ కి కావాల్సిన రొమాంటిక్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ని అయితే కొంత అటు ఇటుగా లాగించేయగలరు. కానీ ఎంత రొమాన్స్ ఉన్నా లవ్ స్టోరీలో ఎమోషన్ కనెక్ట్ కాకపోతే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయి సినిమా చూడడం మానేసి వేరే ముచ్చట్లు పెట్టుకుంటారు. అదే జరగడం వలన ప్రేక్షకులకి ఈ మిస్టర్ అండ్ మిస్ సినిమా అయిపోయే టైంకి అబ్బా ఈ సినిమా మిస్ చేయాల్సిందే అనే ఫీలింగ్ వస్తుంది.

చూడాలా? వద్దా?: ఓటిటిలో ఐతే కాస్త కష్టమైనా ట్రై చేయచ్చేమో, థియేటర్స్ లో కష్టమే.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.75/5 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...