మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నేటి మధ్యాహ్నం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు శుక్రవారమే హైదరాబాద్ వెళ్లారు. ఈక్రమంలో అవినాశ్ రెడ్డి సీబీఐకి ఓ లేఖ రాశారు. తన ప్రతిష్ఠ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో రాశారు.
లేఖలోని పలు అంశాలను పరిశీలిస్తే.. ‘నా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివేకా హత్య కేసు పారదర్శకంగా జరగాలి. విచారణ సమయంలో నా వాయిస్ రికార్డు చేయాలి. ఇందుకు నా లాయర్ ను నాతోపాటు ఉండేందుకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు. అయితే.. అవినాశ్ లేఖకు సీబీఐ నుంచి సమాధానం రాలేదు.
అవినాశ్ కు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య జరిగిన నాటి నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా అవినాశ్ రెడ్డి విచారణకు సీబీఐ సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కేసు బదిలీ అయింది.