Switch to English

సినిమా టిక్కెట్టు గోల: మళ్ళీ మొదలైంది.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినిమా టిక్కెట్ ధరలపై నియంత్రణ.. దేశంలో ఎక్కడా ఇలాంటి పైత్యం లేనే లేదంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న వైనం.. నిత్యావసర వస్తులపైనగానీ, పెట్రో ధరలపైనగానీ లేని నియంత్రణ కేవలం సినిమా టిక్కెట్లపైనే ఎందుకంటున్న జనం.. ఎవరేమనుకున్నా మారని అధికార పార్టీ ఆలోచన.!

సినిమా టిక్కెట్ ధర 100, 150.. ఆ పైన వుంటే, సినిమా చూడాలనుకున్నవారికే నష్టం. పెట్రో ధరల వ్యవహారం అలా కాదు.. వాడినోడికీ, వాడనోడికీ వాత తప్పదు.. ఎందుకంటే, పెట్రో ధరలు పెరిగితే.. అన్ని ధరలూ పెరిగిపోతాయ్. అయినాగానీ, పెట్రో ధరల్ని తగ్గించరు.. సినిమా టిక్కెట్ల ధరలైతే తగ్గించేస్తారు.

పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ, ఏపీలో సినిమా టిక్కట్ల ధరల అంశం ఇంకోసారి చర్చకు వస్తోంది. ‘టిక్కెట్ ధరలు తగ్గించడం ద్వారా తమ సినిమాపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందనీ.. ఈ విషయమై కోర్టుకు వెళ్ళబోంగానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చిస్తామనీ’ ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ప్రకటించింది.

మరి, యావత్ సినీ పరిశ్రమ ఈ అంశంపై ఏం మాట్లాడుతుంది.? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నాడు.? ‘మీరంతా సినిమా పరిశ్రమ వైపు వుంటారా.? పవన్ కళ్యాణ్ వైపు వుంటారా.?’ అంటూ సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్‌ని వేరు చేసి చూడటం తేలికే.. కానీ, సినిమా టిక్కెట్ల విషయమై ఏపీలోని అధికార పార్టీ వక్రబుద్ధిని ప్రశ్నించాలంటే ధైర్యముండాలి.. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్.. కానీ, ఆయనతో గొంతు కలపలేకపోయిన చేతకానితనం సినీ పరిశ్రమలో వుందన్న విమర్శలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపిస్తున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే కాదు, మరికొన్ని సినిమాలకూ ఈ సమస్య వుంది. మరి, ఈ సమస్య నుంచి సినీ పరిశ్రమ గట్టెక్కేదెలా.? ధైర్యం చేసి, కలసికట్టుగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా.? బతిమాలుకుని అప్పటికప్పుడు తమ సినిమాల్ని గట్టెక్కించుకుంటారా.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

రాజకీయం

ఇది గుజరాత్ కాదు.. పోరుగడ్డ తెలంగాణ మోదీ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన...

మార్పు తథ్యం.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు: సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ,...

జనసేనాని ప్రశ్న స్పష్టం: వైసీపీ వద్ద సమాధానం లేని వైనం.!

కోడి కత్తి కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది ఎన్ఐఏ.. అది జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో వుంది గనుక.....

తెలంగాణ: కుటుంబ పాలన నుంచి బీజేపీకి అధికారం ఖాయం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ...

జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడపలేరు: చంద్రబాబు

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడుకు వెళ్తూ చిలకలూరిపేట చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమలాపురంలో పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై...

ఎక్కువ చదివినవి

మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు.. చీమలదండులా వెళ్తాం: అచ్చెన్నాయుడు

టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు చలానాలు కూడా కట్టించుకుని ఇప్పుడు వేసవి రద్దీ అంటూ బస్సులు...

రాశి ఫలాలు: ఆదివారం 22 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:31 సూర్యాస్తమయం: సా.6:27 తిథి: వైశాఖ బహుళ సప్తమి రా.6:01వరకు తదుపరి వైశాఖ బహుళ అష్టమి సంస్కృతవారం: భానూవాసరః (ఆదివారం) నక్షత్రము: ధనిష్ఠ.రా.తె.3:31 వరకు తదుపరి శతభిషం యోగం:...

నైజాంను నేను శాసించడం జరగదు – దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే టాప్ నిర్మాతగా ఎదిగి అక్కడి నుండి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నిర్మాత అవ్వకముందు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్...

జస్ట్ ఆస్కింగ్: పవన్ రాజకీయాలకు నిర్మాతలు బలైపోతున్నారా.?

రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. అనుకోవడానికి బాగానే వుంటుంది. కానీ, రెండిటినీ వేర్వేరుగా చూడలేని పరిస్థితి వచ్చేసింది. రాజకీయ కుట్రలతో సినిమాల్ని అడ్డుకునే రాక్షసత్వం, అసహనం అధికారంలో వున్నవారికి పెరిగిపోయింది. ‘వకీల్ సాబ్’...