Switch to English

సినిమా రివ్యూ : ఎవరు

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు : అడవి శేష్, రెజినా, నవీన్ చంద్ర తదితరులు ..
రేటింగ్ : 3 / 5
సంగీతం : శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్ : గ్యారీ బి ఎచ్
కెమెరా : వంశీ పచ్చిపులుసు
దర్శకత్వం : వెంకట్ రామ్ జి
నిర్మతలు : పరమ్ వి పొట్లూరి, వి పొట్లూరి, కెవిన్ అన్నే

భిన్నమైన సినిమాలతో మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు అడవి శేష్. తాజగా అయన చేసిన మరో ప్రయత్నమే ఎవరు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జి తెరకేకించిన ఈ మర్డర్ మిస్టరీ ఈ రోజు విడుదలయింది. మరి ఆ మర్డర్ ని ఎవరు చేసారో, అసలు కథేమిటో అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

అశోక్ కృష్ణ ( నవీన్ చంద్ర ) మర్డర్ కేసులో సమీరా ( రెజినా ) అరెస్ట్ అవుతుంది. ఆ తరువాత జరిగిన ఆసక్తికర సంఘటనల అనంతరం ఈ కేసును డీల్ చేయడానికి వస్తాడు పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవ్ ( అడవి శేష్ ). రంగంలోకి దిగిన అయన ఈ కేసును ఛేదించే విషయంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడతాయి. కేసు క్లోజింగ్ సమయానికి సమీరా పై ఓ మిస్సింగ్ కేసు కూడా పడుతుంది. అసలు మిస్సింగ్ కేసుకు సమీరాకు ఉన్న సంబంధం ఏమిటి ? అసలు సమీరా ఎందుకు అశోక్ కృష్ణ ను చంపింది అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

మర్డర్ మిస్టరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా అడవి శేష్ మంచి మార్కులు కొట్టేసాడు. పాత్ర తాలూకు వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజినా బాగా చేసింది. నటనతో పాటు కొన్ని బోల్డ్ సీన్స్ తో మంచి మైలేజ్ ఇచ్చింది . ఓ మర్డర్ కేసు విషయంలో ముద్దాయిగా ఆమె నటన హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. నవీన్ చంద్ర కూడా తనదైన పాత్రలో బాగా చేసాడు. అతని ఎమోషన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక మిగతా పాత్రల్లోని నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే చేసారు. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో మిస్సింగ్ అండ్ మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేసింది. ముఖ్యంగా అడవి శేష్ .. పాత్ర ట్ తాలూకు భిన్నమైన షేడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

టెక్నీకల్ హైలెట్స్ :

టెక్నీకల్ విషయాలను పరిశీలిస్తే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఫోటోగ్రఫి, వంశీ అందించిన కెమెరా హైలెట్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కెమెరా పనితనం సూపర్. అలాగే శ్రీచరణ్ అందించిన సంగీతం, ఆర్ ఆర్ బాగా సెట్ అయింది. కథను నడిపించేందుకు ఆర్ ఆర్ బాగా తోడ్పడింది. ఎడిటింగ్ పరవాలేదు .. కొన్ని సన్నివేశాలు ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు వెంకట్ తీసుకున్న కథ, కథనాలు కొత్తవి కాకున్నప్పటికీ దాన్ని కొత్తగా నడిపించే ప్రయత్నం చేసాడు. అయితే సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ నేపథ్యంలో సీరియస్ గా సాగడం, కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజ్ చేస్తాయ్, ఇలాంటి కొన్ని అంశాలు బోర్ కొట్టిస్తాయి. పైగా చాలా సన్నివేశాల్లో డ్రామా ఎక్కువైంది. కావాలని సీన్స్ రాసుకున్నట్టుగా ఉన్నాయి తప్ప .. నాచురాలిటీ గా అనిపించవు. రెజినా గ్లామర్ కాస్త రిలీఫ్ ఇచ్చే అంశాలు.

విశ్లేషణ :

క్రైం నేపథ్యంలో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. నవీన్ చంద్ర నటన, రెజినా గ్లామర్ హైలెట్ గా నిలిస్తే .. విక్రమ్ వాసుదేవ్ గా అడవి శేష్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ దానికి సంబందించిన కథనం .. కొత్తగా సాగింది. కొన్ని సన్నివేహాలు బోర్ కొట్టించడం. మరి కొన్ని సన్నివేశాలు కావాలని పెట్టినట్టుగా ఉండడం లాంటివి బోర్ కొట్టే అంశాలు. మొత్తానికి ఎవరు అంటూ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.

ట్యాగ్ లైన్ : ఆకట్టుకునే థ్రిల్లర్ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

రాశి ఫలాలు: సోమవారం 03 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ అష్టమి సా..4:02 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ నవమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: పూర్వాషాఢ రా.12:50...

కప్పులో పప్పు రేవంత్.! ఐటమ్ బాంబ్ ఆర్జే సూర్య.!

సమంత వేస్టు.. ఆర్జే సూర్య తోపు.! అనవసరంగా కోట్లు వెచ్చించి సమంతతో ‘పుష్ప ది రైజ్’ సినిమాలో సుకుమార్ ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేయించినట్లున్నాడు. హీరోల్లా మాట్లాడటమే...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్.

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో -...