Switch to English

సినిమా రివ్యూ: సాహో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌, మందిరా బేడీ, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు.
సంగీతం: ఆదిత్య సింగ్‌, ఎహ్‌సాన్‌ నూరాని, గురు రన్‌ద్వా, లాయ్‌ మెండోసా, శంకర్‌ మహదేవన్‌, తనిష్‌క బాగ్చి, మరియు గిబ్రాన్‌ (బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌)
సినిమాటోగ్రఫీ: ఆర్‌ మది
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి
దర్శకత్వం: సుజీత్‌

రేటింగ్‌: 2/5

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా ‘సాహో’ వార్తల్లోకెక్కింది. ఒకే ఒక్క సినిమాని తెరకెక్కించిన సుజీత్‌ని దర్శకుడిగా ఎంచుకుని, ‘బాహుబలి’ లాంటి విజయం తర్వాత రిస్క్‌ చేసిన ప్రభాస్‌ గట్స్‌ని మెచ్చుకోవాలి. ‘బాబహుబలి’ రికార్డుల్ని కొల్లగొట్టేస్తుందా.? అనే చర్చ ‘సాహో’ విషయంలో జరిగిందంటే, ఆ స్థాయిలో సినిమా కోసం అన్నీ డిజైన్‌ చేశారు.. ప్రమోషన్స్‌లో ఆ రేంజ్‌ చూపించారు మరి. ఇంతకీ, ‘బాహుబలి’ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమాగా ‘సాహో’ నిలిచిందా.? ప్రభాస్‌ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని సుజీత్‌ ఏం చేశాడు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకి వెళదాం.

కథ:

అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) ముంబై పోలీసుల నుంచి ఓ పెద్ద ఆపరేషన్‌ కోసం నియమితుడవుతాడు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అమృత (శ్రద్ధా కపూర్‌). ఓ పెద్ద రాబరీ కేస్‌ని డీల్‌ చేయడానికి ఈ ఇద్దరూ అసైన్‌ అవుతారు. మాఫియా డాన్‌ రాయ్‌, ఆయన ముఠాని అశోక్‌ చక్రవర్తి ఎలా ఎదుర్కొన్నాడు.? రాబరీని ఎలా ఛేదించాడు.? ఈ క్రమంలో అశోక్‌ చక్రవర్తి సాహసాలు, అమృతతో రొమాంటిక్‌ ప్లస్‌ యాక్షన్‌ జర్నీ ఎలా సాగింది.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

నటీనటులు ఎలా చేశారంటే..

ప్రభాస్‌ ఎప్పుడూ ఫిట్‌ అండ్‌ పెర్‌ఫెక్ట్‌. ఆ విషయం మరోమారు నిరూపితమయ్యింది. హ్యాండ్సమ్‌ హంక్‌ అన్న పదానికి పెర్‌ఫెక్ట్‌ డెఫినిషన్‌గా ప్రభాస్‌ని చూపించొచ్చు. సినిమాలో పలుమార్లు షర్ట్‌లెస్‌గా కన్పిస్తాడు. కంపోజ్డ్‌ అండ్‌ క్లవర్‌ అండర్‌ కవర్‌ కాప్‌గా ఫస్ట్‌ హాఫ్‌లో కన్పించిన ప్రభాస్‌, సెకెండాఫ్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కన్పించాడు.

శ్రద్ధా కపూర్‌ విషయానికొస్తే, యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో బాగా కన్పించింది. అమె అప్పీయరెన్స్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా వుంటుంది. గ్లామరస్‌గానూ, నటనతోనూ ఆకట్టుకుంది శ్రద్ధా కపూర్‌. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌ తమ తమ పాత్రల్లో రాణించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌

దర్శకుడు సుజీత్‌, కథ మీద కథనం మీద ఫోకస్‌ పెద్దగా పెట్టలేదేమో అన్పిస్తుంది. కేవలం కొన్ని ఎలివేటెడ్‌ సీన్స్‌ రాసుకుని, సాంకేతిక హంగులు అద్దేశాడు. సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో వుంది. స్టంట్‌ కొరియోగ్రఫీ అయితే ఇండియన్‌ సినిమాకి సంబంధించి ఇది వెరీ ఫస్ట్‌ టైమ్‌ అనొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా అంతే. పాటల పిక్చరైజేషన్‌ సీంప్లీ సూపర్బ్‌. సీన్స్‌ని ఇండివిడ్యువల్‌గా ఎంజాయ్‌ చేయగలిగినా, సాగతీత అన్పిస్తుంది. ఎడిటింగ్‌కి ఇంకా చాలా స్కోప్‌ వుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ ఓకే.

ప్లస్‌

  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
  • ప్రొడక్షన్‌ వాల్యూస్‌
  • సినిమాటోగ్రఫీ

మైనస్‌

  • స్టోరీ
  • స్క్రీన్‌ప్లే
  • ఎడిటింగ్‌
  • రన్‌ టైమ్‌
  • కామెడీ

చివరగా

సినిమా నిండా ట్విస్ట్‌లే కనిపిస్తాయి. దాంతో కథ మరింత కన్‌ఫ్యూజన్‌కి గురైంది. ‘బాహుబలి’ లాంటి సినిమా చేసిన హీరోతో, 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశం వస్తే, దాన్ని సద్వినియోగం చేసుకుని తన సత్తా చాటాల్సిన దర్శకుడు పూర్తిగా టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ మీద బేస్‌ అయిపోయి, తనకున్న బలాబలాల్ని పక్కన పెట్టేసినట్లు అనిపిస్తుంది. తెరపై హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామన్న భావన కలుగుతుందిగానీ, కథ ఎక్కడ.? కథనం ఎక్కడ? అని వెతుక్కోవాల్సి వస్తుంది. విడివిడిగా ఒక్కో సన్నివేశమూ చూస్తే వావ్‌ అన్పించడం తప్ప, సినిమా పూర్తయ్యాక ఓ మంచి సినిమా చూశామన్న భావన అయితే కలగదు. ఓవరాల్‌గా సుజీత్‌ తన మీద ప్రభాస్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...