Switch to English

సినిమా రివ్యూ: RDX లవ్ 

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు: పాయల్ రాజ్ పుత్, తేజస్, సీనియర్ నరేష్ తదితరులు..
ఎడిటర్‌: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
మ్యూజిక్: రధన్
దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాణం: హ్యాపీ మూవీస్
నిర్మాత: సి. కళ్యాణ్
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019

‘RX 100’ సినిమాతో టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, ‘హుషారు’ ఫేమ్ తేజస్ హీరోగా నటించిన సినిమా ‘RDX లవ్’. హార్డ్ హిట్టింగ్ సోషల్ మెసేజ్ తో బోల్డ్ సినిమాగా రూపొందించిన ‘RDX లవ్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ కి వచ్చిన గ్లామర్ అట్రాక్షన్ ని ఉపయోగించుకొని ట్రైలర్స్, టీజర్స్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రియల్ గా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:  నదికి అవతలి వైపు చంద్రన్న పేట. దానితో పాటు మరో 40 గ్రామాలు.. ఈ గ్రామాలకి ఏం కావాలన్నా 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాలి. దాని వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలను కోల్పోతుంటారు. అదే నదిపై వంతెన కడితే 200 కిమీ కాస్తా 10 కిమీ అవుతుంది. అందుకే ఆ ఊరి పెద్దలు గవర్నమెంట్ కి వంతెన కోసం రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు. కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఊరు యంగ్ జెనరేషన్ కి చెందిన అలివేలు(పాయల్ రాజ్ పుత్) భారతదేశ సంక్షేమ శాఖలో పనిచేస్తూ తన ఊరి సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వంతెన పని పూర్తిచేయాలనుకుంటుంది. అలా  ప్రయాణంలో సిద్దు(తేజస్) ఎలా ఎంటర్ అయ్యాడు? వారిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందా? లేదా? అలివేలు వంతెన విషయంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొంది? చివరికి తన చంద్రన్న పేటకు వంతెనని తీసుకు వచ్చిందా లేదా అన్నదే కథ.

ఆన్ స్క్రీన్ స్టార్స్ పెర్ఫార్మన్స్:   గ్లామర్ విషయంలో పాయల్ రాజ్ పుత్ సై అనడంతో, పాయల్ నటన కంటే ఎక్కువగా అందాల అంగాంగ ప్రదర్శన పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నాడు. అందుకేనేమో నటిగా రెండవ సినిమాతో ఒక మెట్టు పైకి ఎక్కాల్సిన పాయల్ ఒక స్టెప్ కిందకి పడిపోయింది, అలాగే ఈసినిమాతో పాయల్ రాజ్ పుత్ జస్ట్ గ్లామర్ పాత్రలకే పనికొస్తుంది అనేలా ముద్ర పడిపోతుంది. కానీ మాస్ అప్పీల్ అయిన గ్లామర్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఒక తెలిసిన హీరో పేస్ కావాలి, అందుకే తేజస్ ని తీసుకున్నారు.  తేజస్ కి పెద్ద చెప్పుకోదగిన రోల్ కాదు, కానీ ఉన్నంతలో ఓకే చేసాడు. కానీ హుషారు లాంటి సినిమా తర్వాత తన కెరీర్ కి ఎలాంటి మైలేజ్ లేని ఈ సినిమా చేయడం బాధాకరం. సీనియర్ నరేష్ ఎమోషనల్ సీన్ బాగా చేసాడు. ఒకే ఒక్క సీన్ లో అయిన తులసి చాలా బాగా చేసింది. నెగటివ్ షేడ్స్ లో ఆదిత్య మీనన్ నటన కూడా బాగుంది, కానీ ఏపాత్రలో పెద్ద ఏకైక లేదు. మిగతా నటీనటులు పరవాలేధనిపించారు.

ఆఫ్ స్క్రీన్ స్టార్స్ టాలెంట్:   సినిమా కెప్టెన్ అయినా దర్శకుడు కథ, కథనం, దర్శకత్వం బాగుంటే అన్నీ డిపార్ట్ మెంట్స్ అవుట్ ఫుట్ ఆటోమాటిక్ గా బాగుంటాయి. కానీ దర్శకుడు ప్రతి విభాగంలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. శంకర్ భాను గత సినిమా ‘అర్ధనారీ’ అనే సినిమా ఆడకపోయినా దర్శకుడిగా పేరునిచ్చింది. కానీ విజయం కోసం కమర్షియల్ గా చెప్పడమొకటే మార్గమనుకున్నాడో ఏమో, ఈ పాత చింతకాయ పచ్చడి కథకి శృతిమించిన గ్లామర్ ని జోడించి చెప్పాడు. అప్పట్లో వచ్చి ఫ్లాప్ అయినా భగీరథ కథకి, ‘శ్రీమంతుడు’ లాంటి  పాయింట్స్ ని తీసుకొని హీరో కథని కాస్తా మార్చి భీభత్సమైన రోత భూతు కామెడీని జత చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ బొమ్మ. అలాగే కథ ఒకటైతే టీజర్, ట్రైలర్స్ లో ఇదేదో మాంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకునేలా చేసి థియేటర్ లో ఇంకో బొమ్మ చూపించేసరికి ఆడియన్స్ కి చిరాకు వచ్చింది. అలాగే స్క్రీన్ ప్లే పరంగా అనవసరపు డబుల్ మీనింగ్ ట్రాక్స్ తో పరమ రోత పుట్టించారు. ఫస్ట్ హాఫ్ లో ఓపెనింగ్ సీన్ తప్ప ప్రతి సీన్ చిరాకు పుట్టింస్తుంది. డబుల్ మీనింగ్ ఉంటె యూత్ ఎగబడతారని అనుకున్నారేమో కానీ అది విరక్తి పుట్టించేసింది. కథని ఆసక్తిగా, ఆడియన్స్ ని హుక్ చేసేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో థియేటర్ లో ఎవడికి నచ్చిన పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక దర్శకుడిగా బ్లైండ్ కమర్షియల్ ఫార్మాట్ ఎప్పుడైతే ఎంచుకున్నారో అప్పుడే ఈయన ఫెయిల్ అయ్యారు, ఇక తెరమీదకి వచ్చేసరికి అది ఇంకా పేలవంగా తయారయ్యింది. ఫైనల్ గా దర్శకుడికి అందాల ప్రదర్శన మీద ఉన్న శ్రద్ధ కాత్స కథ మీద,  ఉంటే బాగుండేది.

మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే సి.రామ్ ప్రసాద్ విజువల్స్ మాత్రమేబాగున్నాయి. వెరీ బోరింగ్ ఎడిటింగ్. ఇక రధన్ అందించిన పాటలు ఏవీ రిజిష్టర్ కాలేదు, అలాగే నేపధ్య సంగీతంలో అయితే తమిళ కత్తి, తెలుగు ఇంద్ర సినిమాల్లోని ఫెమస్ మ్యూజిక్ ని రిపీట్ మోడీ లో కొట్టారు.  విషయంలో అస్సలు కష్టపడలేదు. సి కళ్యాణ్ గారు మీ నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ మీరు పెట్టిన రూపాయికి విలువని తెచ్చే కథకి పెడితే మీకో హిట్ వచ్చేది. కానీ ఇలాంటి సినిమాలకి పెట్టడం వాళ్ళ మీ బ్యానర్ కి ఓ ఫ్లాప్ సినిమా, మీ డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం తప్ప ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఇకనైనా కథాబలం ఉన్న సినిమాలు చేస్తారని ఆశిస్తూ..

సీటీమార్ పాయింట్స్:

– పాయల్ రాజ్ పుత్ అంగాంగ ప్రదర్శన

– తులసి గారి ఎపిసోడ్

– ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్

బోరింగ్ పాయింట్స్:

– ఎన్నోసార్లు చూసేసిన కథ

– బోర్ కొట్టించే కథనం

– దర్శకుడికి క్లారిటీ లేకపోవడం

– అనవసరపు ఓవర్ బిల్డప్స్

– చిరాకు రొమాంటిక్ సీన్స్

– నవ్వించని డబుల్ మీనింగ్ కామెడీ

– సినిమా అవ్వకముందే ఆడియన్స్ లేచి పారిపోవడం.

విశ్లేషణ:   ‘RX 100’ చూడగానే పాయల్ రాజ్ పుత్ నటన ప్లస్ గ్లామర్ ఎందులో అయినా రెచ్చిపోయి చేస్తోంది అని ఫిక్స్ అయ్యి నిర్మాత డేట్స్ తీసేసుకున్నారు. గ్లామర్ పరంగా ఎంత అంగాంగ ప్రదర్శనకన్నా తాను రెడీ అనడంతో అదే టార్గెట్ గా ఈ సినిమా చేసినట్టు ఉన్నారు.  అందుకే ‘RDX లవ్’ లో కేవలం పాయల్ రాజ్ పుత్ అందాల ప్రదర్శనకే తప్ప మిగతా దేనికీ చోటు లేకుండా చేశారు. అందుకే దీనిని RDX లవ్ అనడం కన్నా RDX భూతు అంటే బెటర్. మీకు భూతు సినిమాలే చూడాలనుకుంటే మీ చేతిలోని మొబైల్ లోనే ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. కావున థియేటర్ వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదు నేను పాయల్ రాజ్ పుత్ అందాలకి వీరాభిమానిని అంటే సినిమాని ట్రై చేయవచ్చు, దాని కోసం కూడా ఫిస్ట్ హాఫ్ చూడక్కర్లేదు, సెకండాఫ్ చుస్తే చాలు.

ఫైనల్ పంచ్: RDX లవ్ – వాళ్ళు చూపించింది, సినిమా అయ్యాక మనం వాడే మాట ఒకటే ” భూతు.. భూతు.. భూతు”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: గురువారం 29 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ చవితి రా.12:30 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: స్వాతి ఉ.7:16...

‘హరిహర వీర మల్లు’ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన...

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

సినిమాల్లో హీరోగా గుర్తింపు కంటే స్టార్ స్టేటస్ ఎంతో ముఖ్యం. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్.. లో ప్రత్యేకత చూపి ప్రేక్షకుల్ని మెప్పించాలి. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్...

సీత నిన్ను ఇంత త్వరగా ఇలా చూస్తాం అనుకోలేదు

ఉత్తరాది ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ గా కూడా మంచి పేరు ను సొంతం...

అన్‌స్టాపబుల్‌ కోసం విజయవాడకి బాలయ్య

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో ప్రోమో అక్టోబర్‌ 4న రాబోతున్న విషయం తెల్సిందే. ప్రోమో విడుదల కార్యక్రమంను విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి...
సినిమా రివ్యూ: RDX లవ్  నటీనటులు: పాయల్ రాజ్ పుత్, తేజస్, సీనియర్ నరేష్ తదితరులు.. ఎడిటర్‌: ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్ మ్యూజిక్: రధన్ దర్శకత్వం: శంకర్ భాను నిర్మాణం: హ్యాపీ మూవీస్ నిర్మాత: సి. కళ్యాణ్ విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019 'RX 100' సినిమాతో టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, 'హుషారు' ఫేమ్ తేజస్ హీరోగా నటించిన సినిమా 'RDX లవ్'. హార్డ్ హిట్టింగ్ సోషల్ మెసేజ్ తో బోల్డ్ సినిమాగా రూపొందించిన...