Switch to English

సుబ్బు వేదుల ‘రాహు’ మూవీ రివ్యూ

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1/5

నటీనటులు: క్రితి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, సుబ్బు వేదుల….
నిర్మాతలు: ఎవిఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
దర్శకత్వం: సుబ్బు వేదుల
సినిమాటోగ్రఫీ: సురేష్ రగతు, ఈశ్వర్ యల్లు మహంతి
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్‌: అమర్ రెడ్డి
రన్ టైమ్: 123 మినిట్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2020

సింగర్ సిద్ శ్రీరామ్ కి ‘రాహు’ టీమ్ థాంక్స్ చెప్పాలి. అతడు పాడిన ‘ఏమో ఏమో ఏమో’ పాట వల్ల సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది. బ్లడ్ చూస్తే కాసేపు బ్లైండ్ అయిపోయే హైస్టీరికల్ బ్లైండ్‌నెస్ / కన్వర్షన్ డిజార్డర్ కాన్సెప్ట్ తో తీసిన సినిమా అని చెప్పడంతో ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ కలిగింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

కథ:

భాను (క్రితి గార్గ్) ఎసిపి (సుబ్బు వేదుల) కూతురు. సిక్కిం టూర్ వెళ్లినప్పుడు శేష్ (అభిరామ్ వర్మ) పరిచయం అవుతాడు. కొన్ని రోజులకు పరిచయం ప్రేమగా మారుతుంది. జాతకాలు కలవలేదని పెళ్లికి ఎసిపి అడ్డు చెప్తాడు. జాతకాలను కాదని పెళ్లి చేసుకుంటే ప్రాణాలకు ప్రమాదమని చెప్తాడు. తండ్రి మాట లెక్క చేయకుండా శేష్ ను భాను పెళ్లి చేసుకుంటుంది. కానీ, తండ్రికి ఆ విషయం చెప్పదు. చెప్పాలని అనుకున్న రోజున కిడ్నాప్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? బ్లడ్ చూస్తే కళ్లు కనపడని పోయే సమస్య ఉన్న భాను, కిడ్నాప్ సమస్యను నుండి ఎలా బయటపడింది? అనేది మిగతా సినిమా.

తెర మీద స్టార్స్..

ఉన్నంతలో క్రితి గార్గ్ బాగా చేసింది. హీరోగా యాక్ట్ చేసిన అభిరామ్ వర్మ చాలా బెటర్ అవ్వాలి. అతడి ఎక్స్‌ప్రెషన్స్ ఏమాత్రం బాగాలేదు. రెగ్యులర్ స్టీరియో టైప్ రోల్ లో కాలకేయ ప్రభాకర్ క్యారెక్టర్ కి జస్టిస్ చేశాడు. సుబ్బు వేదుల యాక్టింగ్ లో ఆర్టిఫిషల్ ఎక్కువ కనిపించింది. కామెడీ కోసం పెట్టిన స్వప్నిక క్యారెక్టర్ క్లిక్ కాలేదు. గిరిధర్, చలాకి చంటి క్యారెక్టర్స్ కూడా కామెడీ చేయలేకపోయాయి.

తెర వెనుక టాలెంట్..

ఆఫ్ ది స్క్రీన్ బెస్ట్ అనిపించిన వాళ్లలో వన్ అండ్ ఓన్లీ టెక్నీషియన్మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు. సాంగ్స్ లో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమో ఏమో ఏమో’, చివరలో వచ్చే ‘ఇది ఒక గ్రహణం’ వినవచ్చు. రీ రికార్డింగ్ పర్వాలేదు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేయడంతో పాటు ప్రొడ్యూసర్స్ లో ఒకరైన డైరెక్టర్ సుబ్బు వేదుల డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. కాని ఆ కాన్సెప్ట్ చుట్టూ ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసే స్టోరీ రాసుకోలేకపోయాడు. ఫస్టాఫ్ లో స్క్రీన్ ప్లే మరీ ఘోరం. ఎడిటింగ్ కట్స్ బాగోలేదు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి, ప్రజెంట్ లోకి వచ్చే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఇరిటేట్ చేసింది. సీన్స్ మధ్య లింక్ మిస్ అయింది. ఇంటర్వెల్ వరకు కథ పెద్దగా ముందుకెళ్ళడు. ఇటువంటి థ్రిల్లర్ కి సూపర్ డైలాగ్స్ పడాలి. కాని ఏ సందర్భంలోనూ డైలాగ్స్ చెప్పుకొనేలా లేవు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ బ్యాడ్. హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది. అది బాగా రాశారు. లాస్ట్ 30 మినిట్స్ థ్రిల్ ఇవ్వడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా రాసుకుని, స్క్రీన్ ప్లే మీద కాన్సంట్రేట్ చేస్తే మంచి సినిమా తీసే టాలెంట్ ఉంది.

విజిల్ మోమెంట్స్:

– ట్విస్ట్స్, లాస్ట్ 30 మినిట్స్

బోరింగ్ మోమెంట్స్:

– ఆర్టిస్ట్స్, పెర్ఫార్మన్స్
– బోరింగ్ ఫస్టాఫ్
– ఫస్టాఫ్ లో స్క్రీన్ ప్లే
– విలన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేయాల్సింది.
– సినిమాటోగ్రఫీ
– ప్రొడక్షన్ వేల్యూస్

విశ్లేషణ: ఆ కన్వర్షన్ డిజార్డర్ ఏదో మనకు వచ్చి స్క్రీన్ మీద వచ్చే సీన్స్ కనిపించకుండా పోతే బాగుండేది అనుకునేలా ఫస్టాఫ్ ఉంది. డైరెక్టర్ సుబ్బు వేదుల మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు కానీ ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చేలా సినిమా తీయలేకపోవడం మైనస్ పాయింట్. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత హీరోయిన్ కి ఒకడి నుండి థ్రెట్ ఉందని ఆడియన్స్ అనుకుంటారు. అతడి నుండి కాదు, థ్రెట్ మరొకరి నుండి అని తెలుస్తుంది. అతడు ఎందుకు చంపాలనుకుంటున్నాడనేది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో లాస్ట్ వరకు ఉంటుంది. అక్కడ డైరెక్టర్ సస్పెన్స్ మైంటైన్ చేశాడు. ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు. కానీ, ఆ 30 మినిట్స్ కోసం అప్పటివరకు సినిమాను చూడడం కష్టమే.

ఇంటర్వల్ మోమెంట్: ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. కాని అంతకు ముందు టార్చర్ రా బాబు!

ఎండ్ మోమెంట్: ఫస్టాఫ్ తో కంపేర్ చేస్తే సెకండాఫ్ కొంచెం బెటర్. కాని సినిమాను చూడడం కష్టమే.

చూడాలా? వద్దా?: డౌట్ లేకుండా స్కిప్ చేయండి

బాక్స్ ఆఫీస్ రేంజ్: అందరూ కొత్తవాళ్లు చేసిన సినిమా కాబట్టి ఓపెనింగ్స్ రావడం గగనమే. పైగా, పోటీలో నాని ప్రొడ్యూస్ చేసిన, విశ్వక్ సేన్ హీరోగా యాక్ట్ చేసిన ‘హిట్’, దుల్కర్ సల్మాన్ హీరోగా యాక్ట్ చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ కాంపీటీషన్ లో వున్నాయి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1/5

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

వైజాగ్ గ్యాస్ లీక్స్: వైఎస్ జగన్ కి వెంకటాపురం గ్రామస్తుల డిమాండ్స్.!

దాదాపు పది రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోగా, పలువురు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. వైఎస్ జగన్ వెంటనే రియాక్ట్ అయ్యి బాధితులందరికీ భారీగా వీరారాలు...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...