Switch to English

Home సినిమా సినిమా రివ్యూ : మహర్షి

సినిమా రివ్యూ : మహర్షి

0
సినిమా రివ్యూ : మహర్షి
WhatsApp-Image-2019-05-09-at-5.23.13-AM
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

నటీనటులు : మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్ తదితరులు
ఎడిటింగ్ : ప్రవీణ్ కె ఎల్
కెమెరా : కె యూ మోహనన్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాతలు : దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి
రేటింగ్ : 3 / 5

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను మూవీ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఒకే అనేశాడు. ఈ సినిమా విషయంలో మహేష్ కోసం ఏకంగా మూడేళ్లు వెయిట్ చేసాడు వంశీ. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమిదే. ఇప్పటికే ట్రైలర్స్, పోస్టర్స్ తో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహర్షి కథేమిటో, అసలు మహర్షి ఎవరో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మహర్షి ( మహేష్ బాబు ). సీఈఓ గా ఎదిగిన మహేష్ తన ఫ్లాష్ బ్యాక్ తాలూకు జీవితాన్ని ఓపెన్ చేస్తాడు. కట్ చేస్తే మహేష్ చదువుతున్న కాలేజ్ లోకి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఉన్నత ఆశయాల కోసం చదువుకుంటున్న మహేష్ తన డ్రీం ని ఫుల్ ఫీల్ చేసే క్రమంలో అమెరికా వెళ్తాడు. అక్కడ ఓ కంపెనీకి సీఈఓ గా ఎదుగుతాడు. ఆ తరువాత అయన ఇండియా రావడం .. ఇక్కడ రైతుల సమస్యలను చూసి చలించిపోవడం, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడం, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడన్నదే అసలు కథ. అమెరికాలో సీఈఓ గా ఉన్న మహర్షి కి ఇక్కడ ఇండియాలో ఉన్న రామాపురంతో ఏమిటి సంబంధం లాంటి వివరాలు మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

మహర్షి సినిమాకు హోల్ అండ్ సోల్ గా చెప్పాల్సింది మహేష్ బాబు గురించే. మహేష్ నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏమిలేదు. ఎమోషన్స్ సన్నివేషాలు, కామెడీ టైమింగ్ లాంటి విషయాల్లో మహేష్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. తనదైన హీరోయిజంతో మహేష్ ఒక్కడే తన భుజాలపై ఈ కథను మోశాడు. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే గ్లామర్ మరో హైలెట్. ఇక నటన పరంగా ఆమెకు పెద్దగా మార్కులేవి పడలేదు. ఎందుకంటే ఇందులో ఆమె నటించాల్సింది పెద్దగా లేదు కాబట్టి .. ఉన్నంతలో పూజ హెగ్డే మంచి మార్కులే కొట్టేసింది. ఇక హీరోనుండి సపోర్టింగ్ రోల్ లోకి షిఫ్ట్ అయిన అల్లరి నరేష్ మంచి పాత్రనే చేసాడని చెప్పాలి. నరేష్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఇక తనదైన నటనతో నరేష్ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పొకోవలసింది ఏమి లేదు ..ఎందుకంటే వారి వారి పాత్రల్లో బాగానే నటించేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

టెక్నీకల్ విషయాలకి వస్తే ఈ సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ రి రికార్డింగ్ అదరగొట్టాడు. అయితే పాటల విషయంలో పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు. ఎందుకంటే దేవి శ్రీ గత సినిమాల తాలూకు పాటలు సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్టవ్వడం .. ఆ పాటల హిట్ తో సినిమా పై అంచనాలు పెరగడం చూస్తున్నదే . కానీ ఆ మ్యాజిక్ మాత్రం ఈ సినిమాలో రిపీట్ అవ్వలేదు. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పని చెప్పాల్సింది. ఎందుకంటే సినిమాలో చాలా సన్నివేశాలు స్లో గా సాగుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. పైగా సినిమా నిడివి కూడా ఎక్కువే కాబట్టి అది పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. సినిమా దాదాపు మూడు గంటలపాటు సినిమా సాగుతుందంటే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక కెమెరా పరంగా మంచి మార్కులే పడ్డాయి. కె యూ మోహనన్ అందించిన కెమెరా సినిమాకు కొత్త లుక్ ని తీసుకొచ్చాయి. నిర్మాణ విలువలకు డోకా లేదు. ఫైనల్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి అందించిన కథ, స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ చాలా సన్నివేశాలు ఇంతకుముందే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా కథ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు. ఇక డైరెక్టర్ గా వంశీ మేకింగ్ స్టయిల్ గురించి అందరికి తెలుసు. తనదైన స్టైల్ లో సినిమాకు కానీ కథ, కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.

విశ్లేషణ :

రైతు సమస్యల నేపధ్యాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాతో మంచి సోషల్ మెసెజ్ అందించే ప్రయత్నం చేసారు. అయితే కథ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బాగుండేది. రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునే ప్రయత్నం చేయవు. పైగా ఎక్కువ నిడివి ఉండడం వల్ల సినిమా మధ్య మధ్యలో బోర్ కొట్టేస్తుంది. ఈ సినిమాకు ప్రధాన అంశాలుగా మహేష్ నటన, పూజ హెగ్డే గ్లామర్, కాలేజ్ సన్నివేశాలు, కామెడీ లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. మహేష్ కెరీర్ లో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలో ఓ మంచి సోషల్ కాజ్ ఉన్న కథను తీసుకున్నప్పటికీ అది ఆ సినిమాల స్థాయిలో మాత్రం లేదని చెప్పాలి. మొదటి భాగం సరదాగా సాగిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అనవసర సన్నివేశాలతో బోర్ కొట్టించాడు దర్శకుడు. ఏమాత్రం ఆకట్టుకొని సంగీతం, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బాగుండేది. మొత్తానికి మహర్షి అంటూ మరో సోషల్ మెసెజ్ తో మహేష్ చేసిన ప్రయత్నం ఆయన అభిమానులకు బాగా నచ్చుతుంది.