Switch to English

దుల్కర్ సల్మాన్ ‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షణ్, నిరంజని, గౌతమ్ మీనన్, అనీష్ కురువిల్ల…
నిర్మాతలు: వయాకామ్18 పిక్చర్స్, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
దర్శకత్వం: దేసింగ్‌ పెరియసామి
సినిమాటోగ్రఫీ: కె.ఎం. భాస్కరన్
మ్యూజిక్: మసాలా కాఫీ
బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్‌: ప్రవీణ్ ఆంటోనీ
రన్ టైమ్: 2 గంటల 42 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2020

దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ‘ఓకే బంగారం’, ‘మహానటి’ సినిమాలు టాలీవుడ్ ఆడియన్స్ కి అతడిని దగ్గర చేశాయి. అదర్ లాంగ్వేజెస్ లో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసే సినిమాలను చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అందువల్ల, దుల్కర్ యాక్ట్ చేసిన తమిళ్ ఫిలిం తెలుగులో రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ. సినిమా వాళ్ళను హ్యాపీగా ఉంచేలా ఉందొ లేదో చూద్దాం.

కథ: సిద్ (దుల్కర్ సల్మాన్) యాప్, గేమింగ్ డిజైనర్. ఫ్రెండ్ కాలిస్ (రక్షణ్)తో గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ రెంట్ కి తీసుకుని ఉంటాడు. లగ్జరీ లైఫ్ స్టయిల్ కోసం అలవాటు పడిన ఇద్దరు మోసాలు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్…. ఆన్ లైన్ లో ల్యాప్‌టాప్స్ ఎక్సట్రా ఎక్సట్రా బుక్ చేసి, అందులో కొత్త పార్ట్స్ తీసి పాతవి పెట్టి ఏదో సాకు చెప్పి రీప్లేస్ అడుగుతారు. మళ్లీ కొత్తగా వచ్చినవి ఓఎల్ఎక్స్‌లో, పార్ట్స్ బ్లాక్‌లోఅమ్మి జల్సాలు చేస్తుంటారు. అటువంటి సిద్, మీరా (రీతూ వర్మ)ను లవ్ చేస్తాడు. మీరా ఫ్రెండ్ శ్రేయ (నిరంజని)ను కాలిస్ లవ్ చేస్తాడు. నలుగురు కలిసి హ్యాపీగా ఉంటున్న సమయంలో రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటారు. అందుకు ఎక్కువ మనీ కావాలి కాబట్టి సిద్, కాలిస్ కొత్త మోసాలకు పాల్పడతాడు. ఒకసారి పోలీసుల ట్రాప్ లో పడి జస్ట్ మిస్ అవుతారు. దాంతో అన్నిటికి చెక్ పెట్టి అమ్మాయిలతో కలిసి గోవా వెళతారు. పోలీస్ ప్రతాప్ సింహ (గౌతమ్ మీనన్) వీళ్ల ఆచూకీ కనిపెట్టి గోవా వెళ్తాడు. సిద్, కాలిస్ దొరుకుతారు. కాని అక్కడ మీరా, శ్రేయ ఉండరు. వాళ్లు ఏమయ్యారు? అమ్మాయిల కోసం కూడా ప్రతాప్ సింహ ఎందుకు వెతుకుతున్నాడు? వాళ్ల మిస్సింగ్ వెనుక స్టోరీ ఏంటి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా

తెర మీద స్టార్స్..

రియల్ లైఫ్ ఏజ్ క్యారెక్టర్ కాబట్టి దుల్కర్ సల్మాన్ ఈజీగా యాక్ట్ చేశాడు. సింపుల్, స్టయిలిష్ గా కనిపించాడు. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో రీతూ వర్మ అదరగొట్టింది. హీరోయిన్ క్యారెక్టర్ లో ట్విస్ట్స్ కి రీతూ వర్మ ఫేస్ లో ఇన్నోసెన్స్ ఒక రేంజ్ లో హెల్ప్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత, అంతకు ముందు యాక్టింగ్ బాగా చేసింది. దుల్కర్, రీతూ వర్మ కెమిస్ట్రీ బావుంది. కాని లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. హీరోతో హీరోయిన్ ఎలా లవ్ లో పడింది అనేదానికి లాజిక్ లేదు. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ గా రక్షక్, నిరంజని జస్ట్ ఓకే. యాక్టర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గౌతమ్ మీనన్. కాప్ రోల్ లో స్టయిలిష్ గా సూపర్ యాక్టింగ్ చేశారు. రిచ్ బిజినెస్ మాన్ రోల్ లో అనీష్ కురువిల్ల సూట్ అయ్యారు.

తెర వెనుక టాలెంట్..

‘కనులు కనులను దోచాయంటే’కి టెక్నికల్ పరంగా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినది సినిమాటోగ్రాఫర్ భాస్కరన్, బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్. స్క్రీన్ మీద ఈచ్ ఫ్రేమ్ బ్యూటిఫుల్ గా ఉంది. హర్షవర్ధన్ ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు. మసాలా కాఫీ సాంగ్స్ వినడానికంటే విజువల్ గా బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటర్ ఫస్టాఫ్ లో అనవసరమైన సీన్స్ కట్ చేయాల్సింది.

ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన దేసింగ్ పెరియసామి విషయానికి వస్తే… స్టోరీ కంటే స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఫస్టాఫ్ లో ఫస్ట్ 15 మినిట్స్ చాలా బోర్ కొట్టించాడు. తర్వాత కూడా రొటీన్ స్టోరీతో ఇంటర్వెల్ వరకు బండి లాగించాడు. అమ్మాయిని చూసి అబ్బాయి లవ్ చేయడం, అబ్బాయిలు మోసాలు చేయడం, పోలీస్ నుండి తప్పించుకోవడంతో సరిపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కంటెంట్ లేకపోవడం వల్ల సోసోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో సినిమా ట్రాక్ ఎక్కింది. ఇంట్రెస్టింగ్ గా బండి ముందుకు వెళ్ళింది. ట్విస్ట్స్ కూడా బాగున్నాయి. అలాగని ఇది కంప్లీట్ న్యూ స్టోరీ కాదు. కోర్ థీమ్ పాయింట్ మీద తాప్సి యాక్ట్ చేసిన ‘నీవెవరో’ వచ్చింది. అదే పాయింట్ ని డైరెక్టర్ డిఫరెంట్ గా డీల్ చేశాడు. ఆడియన్స్ కి థ్రిల్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు.

విజిల్ మోమెంట్స్:

– సెకండ్ హాఫ్
– స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్ & టర్న్స్
– దుల్కర్ సల్మాన్, రీతూ వర్మల జోడీ, పెర్ఫార్మన్స్
– ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

బోరింగ్ మోమెంట్స్:

– స్పీడ్ బ్రేకర్స్ లాంటి సాంగ్స్
– నో ఎంటర్టైన్మెంట్
– రొటీన్ ఫస్ట్ హాఫ్
– లవ్ ట్రాక్

విశ్లేషణ: టాలీవుడ్ ఆడియన్స్ చూసిన దుల్కర్ సల్మాన్ సినిమాలతో కంపేర్ చేస్తే, ఇది డిఫరెంట్ ఫిలిం. ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కమ్ థ్రిల్లర్స్ తో కంపేర్ చేసినా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే 100% థ్రిల్ ఇవ్వడంతో సినిమా ఫెయిల్ అయింది. 50% థ్రిల్ ఇచ్చింది. సెకండ్ హాఫ్ సినిమాకు స్ట్రెంత్. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 15, 20 మినిట్స్ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్లి సినిమాను రన్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్స్ బాగోవడం, స్క్రీన్ ప్లే రేసీగా ఉండడంతో బాగుంది అనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు వస్తారు. సినిమా డిజప్పాయింట్ అయితే చేయదు.

ఇంటర్వల్ మోమెంట్: హీరో, అతని ఫ్రెండ్ కోసం పోలీసులు వచ్చారని అనుకుంటే అలా జరిగింది ఏంటి?అర్జెంట్ గా సెకండాఫ్ లో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి.

ఎండ్ మోమెంట్: బొమ్మ పర్లేదు. డీసెంట్ ట్విస్ట్స్, టర్న్స్. క్లైమాక్స్ అయ్యాక వచ్చే లాస్ట్ సీన్ మిస్ అవ్వొద్దు. గౌతమ్ మీనన్ కోసం చూడండి.

చూడాలా? వద్దా?: దుల్కర్ ఫాన్స్, ట్విస్టులు కల రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఇష్టపడేవాళ్లు సినిమాను హ్యాపీగా చూడొచ్చు.

బాక్స్ ఆఫీస్ రేంజ్: దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ వల్ల మెట్రో సిటీస్ లో డీసెంట్ ఓపెనింగ్స్ రావొచ్చు. ఈ శుక్రవారం మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మౌత్ టాక్ మీద కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

మిడతల దండుతో విమానాలకూ ప్రమాదమే.. ఎలాగంటే

కరోనాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య భయపెడుతోంది. దేశం యావత్తూ చర్చనీయాంశమైన ఆ అంశమే ‘మిడతల దండు’. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా.. వంటి రాష్ట్రాల్లో వీటితో పంట...

ఓటిటి రిలీజ్: జ్యోతిక ‘పొన్మగళ్ వందాల్’ తమిళ్ మూవీ రివ్యూ

నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ నిర్మాత: సూర్య దర్శకత్వం: జేజే ఫెడ్రిక్ రన్ టైం: 2 గంటల 3 నిముషాలు విడుదల తేదీ: మే 29, 2020 ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ తమిళ నటి జ్యోతిక నటించిన కొత్త...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

పారిపోయి అందరిని టెన్షన్‌ పెట్టిన కరోనా పాజిటివ్‌ పేషంట్‌

కరోనా ఉందనే అనుమానం ఉంటేనే వారికి ఆమడ దూరంలో ఉండాలని డాక్టర్లు మరియు పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కరోనా పేషంట్‌ కనిపించినా కూడా వెంటనే వారిని పట్టుకుని వెళ్లి ఐసోలేషన్‌లో వేస్తున్నారు. వారు...

బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి...