Switch to English

సినిమా రివ్యూ : జెర్సీ

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు : నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, మాస్టర్ రోనిత్, సంపత్, ప్రవీణ్, జయప్రకాశ్ తదితరులు ..
సంగీతం : అనిరుద్
కెమెరా : సాను వర్గీస్
నిర్మాత : సూర్య దేవర నాగవంశీ
రచన, దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

నాచురల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న నాని భిన్నమైన కథలతో స్లో అండ్ స్టడీ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. భావోద్వేగాలను చక్కగా రాణించగలడని నిరూపించుకున్న నాని మరోసారి తనలోని నటుడిని పరిచయం చేసే ప్రయత్నమే జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. మరి జెర్సీ ఎవరు ? క్రికెటర్ గా నాని సక్సెస్ అయ్యాడా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

అర్జున్ ( నాని ) క్రికెటర్ గా రాణించాలని తపనపడే యువకుడు. పైగా ఆటలో మంచి నైపుణ్యం ఉంటుంది. భారత జట్టులో ఆడాలన్నది అతని గోల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రికెట్ కు దూరం అవుతాడు. క్రికెట్ కు అతను దూరం అవుతాడు కానీ .. అతనిలోనుండి క్రికెట్ దూరం కాదు. ఆటకు దూరమయ్యాక తాను బ్రతకలేక సతమవుతుంటాడు. క్రికెట్ వద్దన్నాక ఓ ఉద్యోగం చేస్తాడు. కానీ లంచం తీసుకున్నాడన్న నెపంతో ఆ ఉద్యోగం పోతుంది. ఆ తరువాత ఏ పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఓ నిరాశావాదిలా మిగిలిపోతాడు. అతను అలా పనికిరానివాడిగా మారడంతో అతని భార్య ( శ్రద్ధ శ్రీనాధ్ )తో మనస్పర్థలు వస్తాయి. తన జీవితం ఇలాగే మిగిలిపోకూడదని తెలుసుకున్న అర్జున్ పదేళ్ల తరువాత మళ్ళీ క్రికెట్ లోకి ప్రవేశిస్తాడు. మళ్లీ బ్యాట్ పట్టిన అర్జున్ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా ? లేదా ? అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

సాధారణంగా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాల విషయంలో జెన్యూనిటీ అనేది చాలా అవసరం. హీరో స్పోర్ట్స్ మెన్ అయితే ఖచ్చితంగా అతడు ఆ గేమ్ లో హీరోగా నిలుస్తాడు అన్న సినిమాలే వచ్చాయి .. కానీ అతగాడు ఎంతగా టెన్షన్ పడ్డాడు. ఆ గేమ్ లో గెలిచే విషయంలో అతని ఎఫర్ట్ ఏమిటి, క్రికెట్ గేమ్ ఎలా ఉంటుంది , కోచ్, క్రికెట్ బోర్డు , గ్రౌండ్ ఇలా ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేసాడు దర్శకుడు. ,ముఖ్యంగా ప్రతి విషయాన్నీ చాలా క్షుణ్నంగా చూపించే ప్రయత్నం చేసాడు. ఇక సినిమా మొత్తాన్ని హీరో నాని తన భుజాలపై నడిపించాడు. ముఖ్యంగా అతడు అర్జున్ గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం అద్భుతం అని చెప్పాలి. నాచురల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న నాని కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫెర్మన్సు ఇచ్చాడు. అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా .. ఆ భావోద్వేగాలను బయటపడనివ్వకుండా నలిగిపోయే పాత్రలో నాని ఎమోషన్స్ సూపర్ . హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.. సారా పాత్రలో మంచి నటన కనబరిచింది. ప్రేమికురాలిగా, అటు భార్యగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో జీవించింది. ఇక కోచ్ పాత్రలో సత్యరాజ్ నటన మరో హైలెట్. మంచి ఆటగాడికి ప్రోత్సహం ఏంతో అవసరం అన్న విషయంలో సత్యరాజ్ పాత్ర సాగడం. అర్జున్ తో ఆ పాత్ర కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఇక నాని కొడుకుగా నటించిన మాస్టర్ రోనిక్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలెట్ గా నిలిచింది. ఇక మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగానే చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఓ చక్కని కథను అంతకంటే అద్భుతంగా చెప్పాలంటే దానికి టెక్నీకల్ యాస్పెక్ట్స్ కూడా చాలా అవసరం. కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అద్భుతమైన ఆర్ ఆర్ అందించాడు. దాంతో పాటు పాటలు కూడా బాగున్నాయి. అనిరుద్ సంగీతానికి తోడు సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ ఫోటోగ్రఫి తోడై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.
సినిమాలో పాటలు కూడా కథతో సాగడం సినిమాకు కొత్త ఫీల్ తీసుకొచ్చింది. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడే పనిలేదు. సినిమా మొత్తం క్లాసిక్ గా ఉండేలాతీర్చిదిద్దారు. ఇక రచయిత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓ వైపు దర్శకుడిగా, మరో వైపు రైటర్ గా రెండు పాత్రలకు పూర్తీ న్యాయం చేసాడు దర్శకుడు. జెర్సీ అంటూ టైటిల్ తోనే ఆసక్తి రేపిన దర్శకుడు ఆ కథను ఇంకా అద్భుతంగా చెప్పి ప్రేక్షకుల మనస్సులో చెరగని స్థానం సంపాదించుకున్నాడు .

విశ్లేషణ :

క్రీడల నేపథ్యంలో తెరకెక్కే సినిమా కథల్లో ప్రేక్షకున్నీ ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి. అలా కాకుండా ఎదో గేమ్ చూడడానికి వచ్చామా అని ఫీలింగ్ కలిగిందా ఆ సినిమా సంగతి అంతే సంగతులు. బాలీవుడ్ లో వచ్చిన లగాన్, చక్ దే ఇండియా లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ఎమోషన్స్ కథతో పాటు సాగుతూ ఆ సినిమాలను ఓన్ చేసుకునేలా చేసాయి. జెర్సీ విషయంలో కూడా దర్శకుడు అదే ప్రయత్నం చేసాడు. స్పోర్ట్ సినిమా అంటేనే రియలిస్టిక్ గా జెన్యూన్ గా కథ చెప్పే ప్రయత్నాలు చాలా తక్కువ. కానీ దర్శకుడు గౌతమ్ మాత్రం ఆ ప్రయత్నాన్ని జెన్యూన్ గా చేసి సత్తా చాటాడు. సగటు ప్రేక్షకుడిని కూడా కథలో ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. జెర్సీ సినిమాలో సగటు మనుషుల పాత్రలే కనిపిస్తాయి తప్ప ఎక్కడ అతి అనిపించే సన్నివేశాలు కనిపించవు. అయితే సెకండ్ పార్ట్ లో కథనం కాస్త స్లో గా సాగడంతో కొంత బోర్ కొట్టినట్టు అనిపించినా, కథతో డ్రైవ్ అవుతున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఒక క్రికెటర్ జీవిత ప్రయాణం .. లూసర్ గా మిగిలితే దాన్ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అన్న కాన్సెప్ట్ తో సాగిన జెర్సీ తెలుగులో నిలిచిపోయే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ నాని నటన, ఆ తరువాత చెప్పుకోవలసింది సత్యరాజ్, శ్రద్ధ శ్రీనాధ్ ల పర్ఫార్మెన్స్. దాంతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్స్ తో మరోస్థాయిలో నిలబెట్టే ప్రయత్నమే జెర్సీ.

ట్యాగ్ లైన్ : ఎమోషనల్ జర్నీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

మరీ అంత నీఛమా బిగ్ బాస్.?

సినిమాల్లో హీరోయిన్లు గాఢమైన లిప్ లాక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఓటీటీలో కనిపించే పడక గది వ్యవహారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! సెన్సార్ వున్నాగానీ, సినిమాల్ని కట్టడి చేయలేకపోతున్నాం. ఓటీటీ మీద...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

కోర్టు కేసుల కోసం కోట్లు ఖర్చైపోతున్నాయ్.! ఎవడబ్బ సొమ్మనీ.!

కోర్టు కేసుల కోసం ప్రభుత్వం వందల కోట్లు వృధా చేస్తోందా.? కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ అనుమతుల వివాదానికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనల కోసమే వంద కోట్ల పైన ఖర్చయ్యిందా.?...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా చంటి - గీతు మధ్య జరిగిన...