Switch to English

సినిమా రివ్యూ : డియర్ కామ్రేడ్

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న , శృతి రామచంద్రన్, చారు హాసన్ తదితరులు ..
రేటింగ్ : 2. 75 / 5
మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్
కేమెరా : సుజీత్ సారంగ
బ్యానర్ : మైత్రి మూవీస్
దర్శకత్వం : భరత్ కమ్మ
నిర్మాతలు : నవీన్ యెర్నేని, మోహన్ సివిఎమ్. వై రవిశంకర్

టాక్సీవాలా సక్సెస్ తరువాత విజయ్ దేవరకొండ చేసిన నోటా తో పెద్దగా సక్సెస్ అందుకోలేదు .. కానీ ఆ సినిమాతో అటు తమిళంలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా అయన భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా మొదలైనప్పటినుండి డియర్ కామ్రేడ్ అనే టైటిల్ అందరిలో ఆసక్తి నింపింది .. దానికి తోడు ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయడంతో భారీ రేంజ్ బజ్ ని క్రియేట్ చేసారు. మరి ఈ డియర్ కామ్రేడ్ ఎవరు ? అతను ఏమి చేసాడు అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

బాబీ ( విజయ్ దేవరకొండ ) కాకినాడ యూనివర్సిటీ లో స్టూడెంట్. దాంతో పాటు అక్కడ స్టూడెంట్ యూనియన్ కు లీడర్. అతని ఇంటిపక్కనే ఉండే లిల్లీ ( రష్మిక మండన్న ) తో చిన్నప్పటినుండి కలిసి మెలిసి ఉండడంతో పెద్దయ్యాక అది ప్రేమగా మారుతుంది. ఇద్దరి జోడి బాగుందని అందరు అంటుంటారు. లిల్లీ క్రికెటర్ గా రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది. లిల్లీని అమితంగా ప్రేమించిన బాబీ విషయంలో లిల్లీ ఎప్పుడు గొడవపడుతూ నీ ఆటిట్యూడ్ మార్చుకోవాలని చెబుతుంది. విప్లవ భావాలున్న బాబీ తాను ఇలాగె ఉంటాను .. నీకు నచ్చకుంటే నా లైవ్ లో నుండి వెళ్ళిపో అని చెప్పడంతో లిల్లీ అతనితో విడిపోతుంది .. అలా తనలోని కోపాన్ని తగ్గించుకునేందుకు బాబీ దేశాన్ని చుట్టివచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత మూడేళ్లకు హైదరాబాద్ లో అనుకోకుండా వీరిద్దరూ కలుసుకుంటారు? ఆ సమయంలో లిల్లీ ఆసుపత్రిలో ఉండడం చూసి బాబీ అసలు విషయం తేలుకుంటాడు? అసలు లిల్లీ ఆసుపత్రిలో ఎందుకు ఉంది ? క్రికెటర్ అవ్వాలన్న లిల్లీ తన డ్రీం నెరవేర్చుకుందా లేదా ? ఆమె డ్రీమ్ కోసం బాబీ ఏమి చేసాడు ? అన్నది మిగతా కథ !

నటీనటుల ప్రతిభ :

ఎప్పటిలాగే హీరో విజయ్ తనదైన మాస్ లుక్ తో ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా పరంగా అతనిలో విప్లవ భావాలూ కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి .. వాటిని చూపించే విషయంలో విజయ్ సూపర్. బాబీ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ రష్మిక మండన్న లిల్లీ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సినిమాలో ఆమె నిజమైన క్రికెటర్ గా నటించింది మెప్పించింది. సినిమా మొత్తంగా వారి పేర్లు నిక్ నేమ్ లతోనే సాగడం విశేషం. విజయ్ – రష్మిక ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి జోడి బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సీనియర్ నటులు చారు హాసన్ మాజీ విప్లవ నాయకుడిగా బాగా సూటయ్యాడు. అతను చెప్పే విషయాలు కూడా ఆకట్టుకున్నాయి. మిగతా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల పరంగా బాగా చేసారు. ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చాలా కొత్తగా అనిపించడం విశేషం.

టెక్నీకల్ హైలెట్స్ :

డియర్ కామ్రేడ్ విషయంలో దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాని స్క్రీన్ పైకి తెచ్చే విషయంలో కాస్త తడబడ్డాడు. కథనం చాల నెమ్మదిగా సాగడంతో బోర్ కొట్టింది. కథలో కూడా పెద్దగా ఆసక్తి కలిగించే విషయాలు, ట్విస్ట్ లు పెద్దగా లేకపోవడం మైనస్ గా చెప్పాలి. ఇక మ్యూజిక్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. నాలుగు పాటలు ఆకట్టుకున్నాయి. దానికి తోడు ఆర్ ఆర్ కూడా బాగుంది. అయన పాత్ర, ఎమోషన్ తాలూకు ఎఫెక్ట్ ని తెలిసేలా ఆర్ ఆర్ అందించారు. ఇక కెమెరా పనితనం కూడా బాగుంది. చాలా సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో దేశాన్ని చుట్టొచ్చే సన్నివేశాల్లో ప్రకృతి అందాలను బాగా కవర్ చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే దర్శకుడు ఎంచుకునే కథ ఆకట్టుకున్నా దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా సరైన స్క్రీన్ ప్లే లేదు. కథనం చాలా నెమ్మదిగా సాగడం .. తరువాత ఏమవుతుందో ముందే తెలిసిపోవడం లాంటి విషయాలు సినిమాను నీరుగార్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మొత్తంగా డియర్ కామ్రేడ్ అంటూ దర్శకుడు ఎంచుకున్న ప్రయత్నం బాగుంది. చాలా సమాజంలో జరుగుతున్నా విషయాలను చర్చించాడు దర్శకుడు.

విశ్లేషణ :

డియర్ కామ్రేడ్ గా విజయ్ దేవరకొండ తనదైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు. రష్మిక క్రికెటర్ గా కనిపించి రొటీన్ పాత్రలకు బిన్నంగా ట్రై చేసింది. ఇక విప్లవ భావాలున్న హీరో గా విజయ్ సూపర్. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని స్క్రీన్ పై తెచ్చే విషయంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం తో బోర్ కొట్టింది. పైగా ప్రేక్షకులు ట్విస్టులను కూడా ముందే ఊహించేయడంతో సినిమాలో ఉన్న కిక్ పోయింది. ఇక టెక్నీకల్ విషయాల పరంగా చుస్తే మ్యూజిక్, ఆర్ ఆర్ హైలెట్ గా నిలిచింది. కెమెరా వర్క్ బాగున్నప్పటికీ ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ మరి సాగదీయడం విసుగు తెప్పిస్తుంది. చక్కని ప్రేమకథ, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. మొత్తానికి డియర్ కామ్రేడ్ అంటూ హీరో విజయ్ చేసిన ప్రయత్నం బాగుందని చెప్పొచ్చు.

ట్యాగ్ లైన్ : డియర్ .. అనిపించాడు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన చిరంజీవి ‘ముఠామేస్త్రి’

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన తీరు ఒక అద్భుతం. క్యారెక్టర్ లో...

రాశి ఫలాలు: మంగళవారం 09 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ద్వాదశి మ.2:56 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: మూల ఉ.10:21 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం:...

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా

నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. శృతి హాసన్ ఈ...

మహేశ్ బర్త్ డే స్పెషల్: మహేశ్ కెరీర్.. ‘ప్రిన్స్ టు సూపర్ స్టార్’

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన మహేశ్ తండ్రి వారసత్వం నిలబెట్టారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నటనలో తానెంత చిచ్చరపిడుగో ఆనాడే నిరూపించారు. తండ్రితోనే కాకుండా సోలో హీరోగానూ...