Switch to English

లాక్‌ డౌన్‌ ముగిసినా సంక్షోభం మాత్రం కొనసాగడం తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశ్రమలు తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించి పోయింది. షూటింగ్స్‌ లేకపోవడంతో కార్మికులు, సెలబ్రెటీలు, టెక్నీషియన్స్‌ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఖాళీగానే ఉన్నారు. ఇక థియేటర్ల యాజమాన్యాలు, అందులో పని చేసే వారి పరిస్థితి దారుణంగా ఉంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్స్‌ ప్రారంభం అవుతాయేమో కాని థియేటర్లు మాత్రం ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం థియేటర్లు పూర్తి స్థాయిలో గతంలో మాదిరిగా రన్‌ అవ్వాలంటే ప్రేక్షకులు పూర్తి నమ్మకంగా థియేటర్లకు రావాలి అంటూ కనీసం ఆరు నెలల సమయం అయినా పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో థియేటర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఎలాగూ లేదు కనుక ఖచ్చితంగా సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం లేదు. సినిమాల విడుదల ఉండక పోతే షూటింగ్స్‌ కూడా మందకోడిగా సాగుతాయి.

షూటింగ్స్‌ తక్కువగా ఉంటే మళ్లీ సినీ కార్మికులు రోజు వారిగా జీతానికి చేసే టెక్నీషియన్స్‌ కూడా తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత కూడా సంక్షోభం కొనసాగడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ మునుపటి జోరును కొనసాగించాలంటే ఆరు నెలలు లేదా అంతకు మించే పట్టవచ్చు అంటున్నారు. కేవలం టాలీవుడ్‌ కు మాత్రమే కాకుండా అన్ని భాషల పరిశ్రమలకు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది.

హిందీ సినిమాల బడ్జెట్‌ చాలా వరకు తగ్గనుందని ఇప్పటికే ఒక బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రకటించాడు. అలాగే తెలుగు సినిమాల నిర్మాతలు కూడా కాస్ట్‌ కట్టింగ్‌ కు వెళ్తారని, హీరోల పారితోషికాల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయనిపిస్తుంది. మొత్తానికి ఖచ్చితంగా కరోనా ప్రభావం ఆరు నెలలకు పైగానే ఉంటుందనిపిస్తుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...