Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 10న సంక్రాంతికి విడుదలకాబోతున్న సినిమాకు సంబంధించి తొలి టీజర్ నేడు లక్నోలో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు సతీసమేతంగా లక్నో చేరుకున్నారు. వీరితోపాటు నటి అంజలి, నటుడు ఎస్.జె.సూర్య ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు శంకర్ మిగిలిన కొందరు తారాగణం లక్నోలో జరిగే ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా నిన్న విడుదలైన ప్రోమో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
2021 అక్టోబర్ లో ప్రారంభమైన గేమ్ చేంజర్ మూడేళ్లకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ప్రోమోతో టీజర్ పై భారతీయ సినీ వర్గాల్లో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. సాయంత్రం 4గంటలకు సోషల్ మీడియాతోపాటు ఎంపిక చేసిన దేశంలోని 11 ధియేటర్లలో టీజర్ విడుదలవుతోంది.
View this post on Instagram