అక్కినేని అఖిల్ మూడు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ ను దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా ఈయనకు హిట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఎన్నారై కుర్రాడు అయిన హర్ష(అఖిల్ అక్కినేని) అరేంజ్ మ్యారేజ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ క్రమంలో అతడు స్టాండప్ కమెడియన్ అయిన విభ(పూజా హెగ్డే)ను కలుస్తాడు. ఆమెను చూసి ఇంప్రెస్ అయిన హర్ష తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు.. విభ యొక్క కథ ఏంటీ ఎందుకు ఆమె చాలా ప్రత్యేకం అనేది కథ.
నటనః
అఖిల్ లుక్ తో ఆకట్టుకున్నాడు. హర్ష పాత్రలో అఖిల్ మెప్పించాడు. ఎన్నారై కుర్రాడిగా అతడి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా హర్షగా అఖిల్ నటించి మెప్పించాడు. పూజా హెగ్డే పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంది. ఆమె స్టాండప్ కమెడియన్ గా నటించి మెప్పించింది. లేడీ కమెడియన్ గా పూజా హెగ్డే తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ః
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన కథను ఆసక్తికర కథనంతో నడిపించి మెప్పించాడు. అతడి స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగింది. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా కథను చూపించడంలో ఉపయోగపడింది. గోపీ సుందర్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా స్క్రీన్ ప్లే చాలా చక్కగా వచ్చింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ః
- పూజా హెగ్డే
- సినిమాలోని కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ః
- కథను దర్శకుడు చెప్పాలనుకున్న తీరు ఆసక్తికరంగా అనిపించలేదు
- సెకండ్ హాఫ్ లో ఆకట్టుకోలేక పోయిన సన్నివేశాలు
విశ్లేషణః
సినిమాలో దర్శకుడు ఒక విభిన్నమైన రొమాంటిక్ కథను ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. పండుగ సందర్బంగా విడుదల అయిన ఈ సినిమా అందుకు తగ్గట్లుగా పండుగ ప్లేవర్ ను కలిగి ఉంది. మంచి ప్లాట్ ను తీసుకున్న దర్శకుడు దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం నిరాశ పర్చాడు. మొత్తంగా అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది. అఖిల్ కు ఇది మొదటి కమర్షియల్ హిట్ గా నిలుస్తుంది అనేది చూడాలి.
తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.75/5