అఖిల్ అక్కినేని మొత్తానికి హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన నాలుగో చిత్రంతో మొదటి హిట్ ను అందుకున్నాడు అఖిల్. రీసెంట్ గా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం 50 కోట్ల గ్రాస్ ను సాధించి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా విజయంలో పూజ హెగ్డే కూడా కీలక పాత్రను పోషించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించింది.
థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా సంస్థ కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
గోపి సుందర్ అందించిన పాటలు ఈ చిత్ర విజయానికి మరో ప్రధాన కారణం అయ్యాయి.