Switch to English

వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌: నిరసనలు వద్దంటున్న జనసేనాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై బాద్యతాయుతమైన ప్రకటన చేశారు. ఎవరూ ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనరాదని జనసైనికులు, జనసేన ముఖ్య నేతలకు సూచించారు పవన్‌ కళ్యాణ్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు మంచివి కావంటూ బాధ్యతాయుతమైన ప్రకటన చేసిన జనసేన అధినేత, బాధితుల్ని ఆదుకోవడం కోసం జనసైనికులు ముందుండాలని పిలుపునిచ్చారు.

జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్న జనసేనాని, ఈ ఘటనపై విచారణ జరుగుతున్న దరిమిలా, విచారణ సజావుగా సాగి, కారణాలు తెలిసేవరకూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మరోపక్క, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు, ఈ ఘటనకు కేంద్ర బిందువైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఎదుట ఆందోళనకు దిగాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలతో బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఆ సమయంలో రాష్ట్ర డీజీపీ గౌతవ్‌ు సవాంగ్‌, ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీలోనే వుండడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో కొనసాగడానికి వీల్లేదని బాధిత కుటుంబాలు నినదిస్తున్నాయి. ఘటన జరిగాక సంస్థ యాజమాన్యం తమను పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు.

ఇదిలా వుంటే, ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా సహా, పలు అంశాలపై బాధితులు పెదవి విరుస్తుండడం గమనార్హం. ‘మా ప్రాణాల్ని తీస్తోన్న ఈ సంస్థ ఇక్కడ వుండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు’ అంటూ ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు. మరోపక్క, ప్రభుత్వం, పోలీసులు ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 12 మందికి మరణానికి కారణమైన సంస్థ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయకుండా, న్యాయం కోసం డిమాండ్‌ చేసిన తమను అరెస్ట్‌ చేయడమేంటని బాధితులు వాపోతున్నారు.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

‘‘లవ్ స్టోరీ’’ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

నాగబాబు ట్వీట్స్ పై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్.!

గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్స్ తో న్యూస్ లో దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన గాడ్సే గురించి చేసిన కామెంట్స్...

క్రైమ్ న్యూస్: కూతురు ప్రేమలో పడినందుకు శిక్షగా రేప్‌ చేసిన తండ్రి.. తల్లి సహకారం

నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్‌లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల...