Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: డబ్బు వర్సెస్‌ ప్రాణం.. ఏది ముఖ్యం.?

కరోనా వైరస్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే ముఖ్యమైన టాపిక్‌. నిజానికి, ఇంతకంటే ముఖ్యమైన టాపిక్‌ ఇంకోటి ఈ ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే, ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు కొన్ని దేశాల్లో. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా దెబ్బకు కుదేలవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లో చెప్పాలంటే, అమెరికాలో శవాల దిబ్బల్ని తలపిస్తోంది పరిస్థితి.

డబ్బు వర్సెస్‌ ప్రాణం.. అనే చర్చ వస్తే, ఎవరైనా తొలుత ప్రాధాన్యతనిచ్చేది ప్రాణానికే. బతికుంటే బలుసాకు తినొచ్చు.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ నానుడిని ప్రస్తావించారు. అది ముమ్మాటికీ నిజం. ‘లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందే.. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందన్నది నిజం. అయినాగానీ, డబ్బుతో పోల్చితే ప్రాణమే మిన్న. డబ్బుని మళ్ళీ సంపాదించుకోగలం.. కానీ, పోయిన ప్రాణాన్ని తీసుకురాగలమా.?’ అని కేసీఆర్‌ ఈ రోజు మీడియా ముందుకొచ్చిన సందర్భంలో వ్యాఖ్యానించారు.

కానీ, ఆ ‘డబ్బు’ మనిషిని నడిపిస్తోంది. పది రూపాయల కోసం ప్రాణాలు తీసేసే దుర్మార్గులున్నారు ఈ లోకంలో. ఆ డబ్బు లేకపోతే, ఏ పనీ జరగదు. పూట గడవాలంటే డబ్బుతోనే పని. 21 రోజుల తర్వాత మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌లోనే వుండాలంటే, పేదోడి బతుకు ఏంటి.? ఓ మోస్తరు జీతంతో కాలం వెల్లదీస్తున్నవారి మాటేమిటి.? ఇలాంటి ప్రశ్నలు చాలానే తెరపైకొస్తాయి.

పనిచేస్తున్న చోట ఉపాధి లేక.. సొంతూళ్ళకు వెళ్ళే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు పరిస్థితి ఎలా వుంటుందో.! కేంద్రం మారటోరియంని తీసుకొచ్చింది.. బ్యాంకులు లోన్లపై మారటోరియం ప్రకటించాయి. కానీ, వడ్డీల మోత మోగించేస్తున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా జీతాలు కోల్పోయే చిరు జీవుల పరిస్థితేంటి.? చిరు జీవులే కాదు, ఓ మోస్తరు సంపాదన వున్న ఉద్యోగులు (ప్రైవేటు) పరిస్థితి మరీ భయానకం. వడ్డీకి భయపడి.. మారటోరియంకి దూరంగా వుండాలా.? మారటోరియంని వినియోగించుకోవాలా.? అన్న డైలమాలో చాలామంది మానసిక క్షోభని అనుభవిస్తున్నారు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి కష్టాలు చాలానే వున్నాయి.

కొన్ని సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించడం షురూ చేసేశాయి. అలా ఉద్యోగాలు కోల్పోయేవారి భవిష్యత్తేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదుగాక దొరకదు. అయినాగానీ, డబ్బు కంటే ప్రాణమే ముఖ్యం. ఆ ప్రాణం నిలబడాలంటే మళ్ళీ కావాల్సింది డబ్బే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

విశాఖలో దారుణం: మద్యంకి మించిన కిక్ కోసం స్పిరిట్ తాగి ఐదుగురి మృతి.!

మద్యం మత్తుకు అలవాటు పడిన కొందరి వాళ్ళ విశాఖపట్నం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కశింకోటకు చెందిన ఓ ఐదుగురు స్నేహితులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఇందులో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

యాప్స్ తీసేస్తే చైనా దారికొస్తుందా?

కరోనా వైరస్ కు కారణమైన చైనాపై చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. డ్రాగన్ కంట్రీని ఆంక్షల చట్రంలో బంధించాలని అమెరికా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశం నుంచి తమ కంపెనీలను ఉపసంహరిస్తోంది....

త్రిష ఆ వివాదాస్పద పోస్ట్‌ రానా గురించా?

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష తాజాగా సోషల్‌ మీడియాలో ఎవరైతే తమ మాజీ ప్రేయసిని స్నేహితురాలిగా భావిస్తున్నామని అంటారో వారు చాలా పెద్ద మోసగాళ్లు. వారు అహంకారం కలిగిన వారు అంటూ త్రిష...

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...