మోనాలిసా భోస్లే ఎవరో తెలుసు కదా.. అదే మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వల్ల కొందరు జీవితాలు మారిపోతాయంటే ఇలాంటివి చూస్తే నమ్మాలని అనిపిస్తుంది. ప్రయాగ్ లో మహా కుంభమేళాకి పూసలు అమ్మడానికి వచ్చిన మోనాలిసాని సోషల్ మీడియా స్టార్ ని చేశారు. ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఆమెకు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయి.
సోషల్ మీడియాలో మోనాలిసా క్రేజ్ చూసిన సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. సనోజ్ మిశ్రా చేయబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఐతే ఈమధ్యనే ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న సనోజ్ మిశ్రా ఈ సినిమాకు గాను ఆమెకు 21 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.
పూసలు అమ్ముతూ పాపులర్ అయిన మోనాలిసా తొలి సినిమాకు 20 లక్షల దాకా పారితోషికం అందుకుంటుంది. అంతేకాదు లోకల్ బ్రాండింగ్ కోసం ఆమెకు మరో 10, 15 లక్షల దాకా కాంట్రాక్ట్స్ కూడా వచ్చినట్టు ముంబై మీడియా చెబుతుంది. మహా కుంభమేళాకి వెళ్లడమే మోనాలిసా ఫేట్ మారేలా చేసింది. ఈమధ్యనే మోనాలిసా తన లుక్ మార్చి స్పెషల్ ఫోటోషూట్ చేసింది. అప్పుడే అమ్మడికి సినిమా నీళ్లు పడ్డాయంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్.