ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా కూడా పుకార్లకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు.
మొన్నటి వరకు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా ఆ విషయమై క్లారిటీ రాలేదు. అప్పుడే మరో పాత్రకు నవదీప్‌ను యూనిట్ సభ్యులు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కీలకమైన ఒక పాత్ర కోసం రామ్ చరణ్ పక్కన ఉండే అనుచరుడి పాత్రకు గాను నవదీప్‌ను జక్కన్న తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అందుకే నవదీప్ ప్రస్తుతం ఫిజిక్‌పై దృష్టి పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా నవదీప్ స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించాడు. ఆ సినిమా కోసం తనను ఎవరు సంప్రదించలేదన్న నవదీప్ ప్రస్తుతం వెబ్ సిరీస్ ఇంకా టీవీ షోలతో బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఒకవేళ ఆర్ఆర్ఆర్లో ఛాన్స్ వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించగా తప్పకుండా చేస్తానన్నాడు. రాజమౌళి సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆయన దర్శకత్వంలో చేయాలంటే అదృష్టం ఉండాలంటూ సన్నిహితులతో నవదీప్ అన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నవదీప్ అదిరింది షోకు జడ్జ్‌గా వ్యవహిస్తున్నాడు. తాజాగా ఈయన నటించిన మస్తీస్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాని సినిమాల్లో మాత్రం ఈయనకు అదృష్టం కలిసి రావడం లేదు.
321056 38903Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres plenty of folks that I believe would actually enjoy your content material. Please let me know. Thanks 545897
485258 370110dress shops that offer discounts are quite common in our spot and i always shop at them,. 796519