Mohanbabu: మంచు విష్ణు, మనోజ్ లకు సంబంధించిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ఆజ్యం పోసినట్టు మనోజ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ ఇది ఇక్కడ పరిస్థితి. ఇంట్లోకి వచ్చి ఇలా మా వాళ్ల మీద దాడి చేస్తుంటారు’ అంటూ మనోజ్ ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో మంచు విష్ణు కోపంగా ఉన్నట్లు కనిపించారు.
అయితే మనోజ్ ఈ వీడియోని పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. మంచు సోదరుల మధ్య మనస్పర్ధలు నిజమేనంటు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంటిగుట్టు కాస్త రచ్చకెక్కడంతో ఇద్దరు కొడుకుల మీద మోహన్ బాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే మనోజ్ కి ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయమని ఆదేశించారట. మనోజ్ సైతం ఈ వీడియోలను అప్పటికప్పుడు డిలీట్ చేశారు. అయితే అప్పటికే అవి వైరల్ గా మారిపోయాయి.
అన్నదమ్ముల మధ్య వైరం ఈనాటిది కాదని.. రెండేళ్ల నుంచి వీళ్ళిద్దరికీ పొసగడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. మొన్నామధ్య విష్ణు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ విష్ చేసినప్పటికీ విష్ణు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని చర్చ వినిపించింది. ఇప్పుడు మనోజ్ పోస్టుతో మనస్పర్ధలు బహిర్గతమయ్యాయి. ఇటీవలే మనోజ్, భూమా మౌనిక రెడ్డి ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లిలోనూ విష్ణు సందడి అంతగా కనిపించలేదు. తన అక్క మంచు లక్ష్మి అన్ని తానై పెళ్లి జరిపించింది.
435894 777911This really is something I in fact have to try and do plenty of analysis into, thanks for the post 785985
651977 373355I view something genuinely particular in this internet site . 984084