Switch to English

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

91,314FansLike
57,000FollowersFollow

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన విషయం విదితమే. ఆ భోజనాలు, ఆ పద్ధతి.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కృష్ణంరాజు భోజన ప్రియుడు గనుక, ఆయన మెచ్చే భోజనాన్ని లక్ష మందికి పెట్టడం ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన కుటుంబ సభ్యులు భావించడాన్ని ఎలా తప్పు పట్టగలం.? పైగా, లక్ష మందికి భోజనం పెట్టిన గొప్ప కార్యక్రమాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే. కానీ, ఇందులోకి రాజకీయం చొరబడింది. మొగల్తూరు వేదికగా కుళ్ళు రాజకీయాలు తెరపైకొచ్చాయి.

చిరంజీవిని టార్గెట్ చేస్తూ, ప్రభాస్ అభిమానుల పేరుతో కొందరు జుగుప్సాకరమైన చర్చకు తెరలేపారు. ఆ అవసరం ఎవరికి వుంది.? అన్న కోణంలో అటు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, ఇటు మెగా క్యాంప్ ఆరా తీయకుండా వుంటుందా.? నిజానికి, ఇది పట్టించుకునేంత పెద్ద విషయం కాదు. కాకపోతే, కృష్ణంరాజు – చిరంజీవి అత్యంత సన్నిహితులుగా వుండేవారు. ‘నా సోదర సమానుడు’ అని ఆప్యాయంగా మాట్లాడేవారు కృష్ణంరాజు. అనారోగ్యంతో కృష్ణంరాజు బాధపడుతున్న సమయంలో, ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు చిరంజీవి, అపోలో ఆసుపత్రి ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

ఇక, ప్రభాస్‌ని చిరంజీవి.. తన కుమారుడు చరణ్‌తో సమానంగానే చూస్తారు. ఇదీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల విషయమై ఏపీ ప్రభుత్వంలో చర్చలు జరిపిన బృందానికి చిరంజీవి నేతృత్వం వహిస్తే, ఆ బృందంలో ప్రభాస్ కూడా వున్నాడు.

ప్రధానంగా వైసీపీ మీదనే మొగల్తూరు రాజకీయానికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించాలా.? వద్దా.? అన్నదానిపై అటు ప్రభాస్ తరఫున, ఇటు చిరంజీవి తరఫున.. ఒకింత సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించి, అనవసర రాజకీయ రచ్చకు తెరలేపాలా.? స్థానికంగా పరిస్థితులు అందరికీ తెలుసు గనుక, మాట్లాడకపోవడమే మంచిదన్న కోణంలోనూ ఇరు కుటుంబాలూ ఆలోచన చేస్తున్నాయట.

కాదేదీ రాజకీయానికి అనర్హం.. అన్న కోణంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు జరిగిన ‘బులుగు ప్రయత్నం’ ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పిక్ టాక్: చీర కట్టు ఊర్వశి… మతిపోగొడుతున్న రాక్షసి

రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో...

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న...

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

రాజకీయం

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

న్యాయస్థానాల్లో తీర్పులు.! తెలుగు మీడియాలో వక్రభాష్యాలు.!

సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుల్లోని...

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

జస్ట్ ఆస్కింగ్: ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి.?

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది. వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ...

అయిపాయె.! వివేకా హత్యకేసు తెలంగాణకి బదిలీ.!

వైఎస్ వివేకానందరెడ్డి.! మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ.. తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి పేరు తెలియనివారు వుండరు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్యానా సోదరుడు వైఎస్ వివేకాందరెడ్డి. అంతేనా,...

ఎక్కువ చదివినవి

‘నీ భార్యను కొట్టు వీడియో కాల్లో చూస్తా’ ప్రియురాలి ఆదేశాన్ని పాటించిన శాడిస్టు

వివాహేతర సంబంధంతో ప్రియురాలి ఆనందం కోసం భార్యను కొడుతూ హింసిస్తున్న ఓ శాడిస్టు భర్త అరాచకాలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ప్రియురాలి ఆదేశాలతో తనను దారుణంగా కొడుతూ హింసిస్తున్నాడంటూ భార్య పోలీసులుకు...

కథలో మార్పులు చేస్తున్న పవన్ కల్యాణ్.. గట్టిగానే ఇస్తాడట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను చిత్ర...

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ‘అయ్యా.! యెస్.!’ అనాల్సిందేనా.?

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు ‘యెస్’ అనేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా.? సర్వోన్నత న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇదే.! చిన్న విషయంగా దీన్ని చూడలేం. సర్వోన్నత న్యాయస్థానం ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు....

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....