Switch to English

రైతు గెలిచాడు: కొత్త వ్యవసాయ చట్టాలపై దిగొచ్చిన మోడీ సర్కార్.!

సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలేసింది.. రైతులు అణచివేతకు ఎదురొడ్డి నిలిచారు.. అయినా, తగ్గేదే లేదంటూ కొత్త వ్యవసాయ చట్టాల విషయమై నరేంద్ర మోడీ సర్కార్ ‘ఓవరాక్షన్’ చేసింది. రైతుల్ని తీవ్రవాదులతో పోల్చింది. దేశ వ్యతిరేక శక్తులంటూ బీజేపీ శ్రేణులు, రైతు నాయకులపై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

కానీ, చివరికి రైతు గెలిచాడు. ప్రధాని నరేంద్ర మోడీ దిగి రాక తప్పలేదు. కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిజానికి, రైతుల ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. సులువుగానే ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ క్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ప్రేరేపిత విధ్వంసాలూ జరిగాయి. అయినా, రైతులు వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా రైతులు ఒక్కటయ్యారు. ప్రధానంగా ఉత్తరాది రైతులు మరింత గట్టిగా నిలబడ్డారు. రోజులు, నెలల తరబడి ఉద్యమం కొనసాగింది.

రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ, మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లుగా కొత్త వ్యవసాయ చట్టాల్ని కేంద్రం కొన్నాళ్ళ క్రితం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతులంతా వ్యతిరేకిస్తున్నా, ఈ చట్టాల్ని బలవంతంగా దేశమ్మీద రుద్దేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించి భంగపడింది.

ఇది ప్రజాస్వామ్య విజయం. రైతులు తలచుకుంటే, ప్రభుత్వాల్ని భయపెట్టగలరనే విషయం ఇంకోసారి నిరూపితమైంది. ‘జై కిసాన్..’ నినాదం ఇంకోసారి దేశమంతా గట్టిగా వినిపిస్తోంది.

అయితే, ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో బీజేపీకి తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలోనే మోడీ సర్కార్, కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు దిగొచ్చినట్లుగా భావించాలేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా...

రాజకీయం

చంద్రబాబు వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన

ఇతర పార్టీలతో పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ కార్య నిర్వాహక సభ్యులతో పవన్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటివల చంద్రబాబు చేసిన వన్...

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

ఎక్కువ చదివినవి

దేశంలో కరోనా కల్లోలం..! 24 గంటల్లో లక్షకు పైగా కేసులు

 దేశంలో కోవిడ్ ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. కేవలం 10 రోజుల్లోనే 13 రెట్లు పాజిటివిటీ రేటు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,17,100 మంది కరోనా బారిన పడటం ఇందుకు...

డేంజర్ బెల్స్..! ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తంగా కరోనాతో 14,503 మంది మృతి...

పుష్ప ఓటిటి రైట్స్.. మైండ్ బ్లాక్!!

ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదలవుతుంది కాబట్టి పుష్ప థియేట్రికల్ రన్ ఆ రోజుతో పూర్తైపోతుందని భావించి అమెజాన్ ప్రైమ్ తో డీల్ సెట్ చేసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. అయితే...

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019...

కోవిడ్ దృష్ట్యా.. తిరుమలలో నిబంధనలు కఠినతరం: టీటీడీ చైర్మన్

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని.. కట్టుదిట్టమైన...