Switch to English

మోడీ మాటలు.. ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేతకు సంకేతాలా.?

‘లాక్‌డౌన్‌’ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఆర్థిక రంగ నిపుణులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. కానీ, కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ‘లాక్‌డౌన్‌’ తప్ప ఇంకో మార్గం లేదు. ‘లాక్‌డౌన్‌’కి ససేమిరా అనడంతోనే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు వేలాది మంది ప్రజల ప్రాణాల్ని బలిపెట్టాల్సి వచ్చింది కరోనా వైరస్‌కి.

అగ్రరాజ్యమే ఈ స్థాయిలో విలవిల్లాడుతోంటే, భారతదేశం పరిస్థితేంటి.? అదృష్టవశాత్తూ దేశంలో కాస్త లేటుగానే అయినా ‘లాక్‌డౌన్‌’ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దాంతో, కోనా వైరస్‌ ప్రస్తుతానికి అదుపులో వుంది. కానీ, ఎన్నాళ్ళు.? కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే సుమారు ఏడాదిన్నర సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా మన దేశంలో లాక్‌డౌన్‌ని కొనసాగించలేం. ఈలోగా కరోనా వైరస్‌ని దేశం నుంచి పూర్తిగా తరిమేయగలమా.? అంటే, అదీ అనుమానమే.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తోంటే, ఇంకో రెండు మూడు నెలలు కష్ట కాలమే. కానీ, ఓ వైపు ప్రాణాలు కాపాడుకోవాలి.. ఇంకో వైపు ఆర్థికంగానూ నిలదొక్కుకోవాలి. లేకపోతే, దేశంలో ఆకలి చావులు.. అత్యంత భయంకరంగా వుంటాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి కరోనా వైరస్‌తో చనిపోయినవారి సంగతెలా వున్నా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య కూడా గణనీయంగానే కన్పిస్తోందన్న వాదన లేకపోలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగించడం కొత్త ప్రమాదాలకు కారణమవుతుంది. మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని కొనసాగించాలనే కోరుతున్నా, ప్రధాని నోటా ‘జాన్‌ బీ.. జహాన్‌ బీ..’ అనే మాట ఈ రోజు విన్పించింది.

దానర్థం లాక్‌డౌన్‌ని దశల వారీగా ఎత్తివేయడానికి సుముఖంగా వున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఏప్రిల్‌ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నట్లు ప్రకటించేశాయి. తాజాగా తెలంగాణ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. మరి, ప్రధాని నిర్ణయం ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...