అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో మాడ్రన్ అంగన్వాడీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉపాసన ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆశయాలను నిజం చేసేందుకు కుటుంబ సభ్యులుగా రామ్ చరణ్-ఉపాసన ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ పిఠాపురంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని నిజం చేసేందుకు అపోలో హాస్పిటల్ ను కూడా అక్కడ నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు.
అందుకే పిఠాపురంలో ఈ రకమైన సేవలను అపోలో హాస్పిటల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన చాలా సార్లు పవన్ ను కలిశారు. పవన్ కల్యాణ్ కోసం చరణ్-ఉపాసన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిఠాపురంలో ఇలాంటి అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించి అక్కడ వైద్య సేవలు అందించడం అనేది ఏపీలోనే తలమానికంగా ఉండబోతోందని జనసైనికులు చెబుతున్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేయబోయే మాడ్రన్ అంగన్వాడీల్లో తల్లులు, పసిపిల్లలకు మెరుగైన ఆరోగ్యంతోపాటు పోషకాహారాలను అందించనున్నారు.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని జనసేన నాయకులు చెబుతున్నారు.