జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన “వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్” పథకంలో భాగంగా సెర్ప్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల హ్యాండీక్రాఫ్ట్ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ స్టాల్‌ను వీర మహిళ శ్రీమతి పిల్లా రమ్య జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
తరువాత పిఠాపురం ఇందిరానగర్‌లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన జనసేన వీర మహిళ పిట్ట ముని ఇంటిని, స్థానిక నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ సహకారంతో పునర్నిర్మించి, నాగబాబు గారు అందజేశారు. అనంతరం జగ్గయ్య చెరువు కాలనీ పాత సచివాలయం దగ్గర జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.
అలాగే వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ఫెర్టిలైజర్ డ్రోన్ పని విధానాన్ని శిక్షణ పొందిన యువకులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను కూడా సమీక్షించారు.
ఈ కార్యక్రమాల్లో పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గోదావరి తూర్పు ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి ప్రకాష్, ఏలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊట నాని బాబు, పిఠాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చల్లబోయిన ప్రమీల నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, చల్లా లక్ష్మి, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన సతీష్ కుమార్, లాజర్ బాబు, మత్స అప్పాజీ, పిల్లా శివతో పాటు వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

