‘దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందు మోడీ కంటే ఈడీ వస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ. మా వెనుక ప్రజలున్నారు. మాకు భయం లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో తన పేరు ఉండటంపై ఆమె స్పందించారు.
‘మోదీ ప్రధానిగా ఉన్న 8ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చారు. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఈడీ ఇక్కడికి వచ్చింది. ఎటువంటి విచారణకైనా సిద్ధం’.
‘ఏజెన్సీలు వచ్చి అడిగితే సమాధానం చెప్తాం. కానీ.. మీడియాలో లీకులు ఇచ్చి నేతల పేరు చెడగొట్టాలనే ప్రయాత్నాలను ప్రజలే తిప్పికొడతారు. చైతన్యవంతులున్న తెలంగాణలో అది సాధ్యం కాదు. జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదు. చిత్తశుద్దితో టీఆర్ఎస్ పని చేస్తున్నంత కాలం ఎటువంటి ఇబ్బందీ ఎవరికీ లేదు’ అని అన్నారు.