సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముందుగా ప్రీ లుక్ లో ముసుగు అవతరాలతో ఒక పోస్టర్ చేసి అందులో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కలిగించారు. ఫైనల్ గా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్.ఎం హీరోయిన్ గా తెలుగులోకి అరంగేట్రం చేసింది. ప్రియదర్శి తో పాటు యాక్టింగ్, కామిక్ టమింగ్ తో ఆకట్టుకుంటున విష్ణ్య్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరాలకు మంచి పాత్రలు పడినట్టు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి ఒక గ్యాంగ్ లా మారి మిత్ర మండలితో వినోదాన్ని పంచనున్నారు.
ఈ సినిమాను నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేస్తున్నారు. బన్నీ వాసు కొత్తగా ప్రారంభించిన బి.వి వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమా నిర్మిస్తున్నారు. మోషన్ పోస్టర్ తో అలరించిన మిత్రమండలి సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
