శ్రీని జోస్యుల డైరెక్ట్ చేసిన లో బడ్జెట్ మూవీ మిస్సింగ్ ప్రోమోస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కువగా కొత్త ముఖాలతో రూపొందిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. మరి ఈ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దామా.
కథ:
గౌతమ్ (హర్ష నర్రా), శృతి (నికిషా రంగ్వాలా) సంతోషంగా తమ జీవితాన్ని గడుపుకునే జంట. అయితే అనుకోకుండా, దురదృష్టవశాత్తూ వారు ఒక రోడ్ ట్రిప్ లో ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత శృతి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుండి మిస్ అవుతుంది. సృహ వచ్చిన తర్వాత శృతి కిడ్నప్ అయిందని తెలుసుకున్న గౌతమ్, తన భార్యను వెతకడం మొదలుపెడతాడు.
శృతిని కనిపెట్టడానికి గౌతమ్ చేసే ప్రయత్నాలు ఎలాంటివి? ఈ సమస్యలో జోర్నలిస్ట్ మీనా (మిషా నారంగ్) రోల్ ఎలా లింక్ అయింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
పెర్ఫార్మన్స్:
హర్ష నర్రా స్క్రీన్ ప్రెజన్స్ డీసెంట్ గా ఉంది. మల్టీ షేడ్స్ ఉన్న తన క్యారెక్టర్ లో బెస్ట్ ఇవ్వడానికి చూసాడు. అప్పియరెన్స్ పరంగా మెప్పించిన హర్ష, యాక్టింగ్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇక హీరోయిన్ నికిషా రంగ్వాలా చూడటానికి క్యూట్ గా ఉంది కానీ ఆమెకున్న స్క్రీన్ టైమ్ తక్కువే. మిషా నారంగ్ కు యాక్టింగ్ పరంగా స్కోప్ ఎక్కువ ఉంది, ఆమె కూడా బాగానే చేసింది. కానీ హీరోతో ఈమె పాత్రకున్న కెమిస్ట్రీని సరిగ్గా చూపించలేకపోయారు.
ఛత్రపతి శేఖర్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. ఆయన మెప్పించారు. అలాగే పోలీస్ ఆఫీసర్ గా రామ్ దత్ కూడా బాగా చేసారు.
సాంకేతిక వర్గం:
వశిష్ట శర్మ అందించిన సంగీతం కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాకు ప్లస్ అయ్యాయి. సాంగ్స్ పర్వాలేదనిపించేలా ఉండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేస్తాయి. జనా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ కు క్యాప్చర్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఉదయ్ కుమార్ సౌండ్ డిజైన్ ఇంప్రెస్ చేస్తుంది.
ధర రమేష్ ఆర్ట్ వర్క్ బాగుంది. సత్య జి ఎడిటింగ్ కథను సరిగ్గా ప్రోజెక్ట్ చేసింది. టైట్ బడ్జెట్ లో తెరకెక్కినా నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
పాజిటివ్ పాయింట్స్:
- కాన్సెప్ట్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నెగటివ్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- తెలిసిన ముఖాలు పెద్దగా లేకపోవడం
విశ్లేషణ:
మొత్తంగా చూస్తే మిస్సింగ్ చిత్ర కాన్సెప్ట్ బాగుంది కానీ దీన్ని ఇంకా బాగా తీయవచ్చు అనిపిస్తుంది. దర్శకుడు శ్రీని జోస్యుల ఫ్లాట్ నరేషన్ తో, ముఖ్యంగా మరీ ఎక్కువ సబ్ ప్లాట్స్ తో కథను డైల్యూట్ చేసాడు అనిపిస్తుంది. ఇంప్రెస్ చేసే డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు మినహా, మిస్సింగ్ విషయంలో గొప్పగా చెప్పుకోవడానికంటూ ఏం లేదు. ఓటిటిలో కూడా టైమ్ ఉంటేనే చూడదగ్గ చిత్రమైన దీనిని థియేటర్లలో స్కిప్ చెయ్యవచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5