తాప్సి కీలక పాత్రలో ముగ్గురు పిల్లలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
శైలజ (తాప్సి) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు మీద అండర్ కవర్ లో ఉంటుంది. ఇక మరోవైపు రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే ముగ్గురు చిన్న పిల్లలు ఏకంగా దావూద్ ఇబ్రహీంను పట్టుకుని 50 లక్షల రివార్డ్ ను సొంతం చేసుకుందామన్న కోరికతో ముంబై బయల్దేరతారు. అటు తాప్సి కేసుకు, ఈ ముగ్గురు పిల్లల అన్వేషణకు ముడిపడుతుంది. అక్కడ నుండి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది చిత్ర కథ.
పెర్ఫార్మన్స్:
రఘుపతి, రాఘవ, రాజారామ్ గా నటించిన ముగ్గురు పిల్లలు చాలా బాగా చేసారు. వాళ్ళ పెర్ఫార్మన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చిత్రాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. ఇక కీలక పాత్రలో తాప్సి మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటన బాగుంది. ఇక వీళ్ళు కాకుండా ఇంకెవరికీ పెద్దగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలు దక్కలేదు.
హర్షవర్ధన్, సుహాస్, సందీప్ రాజ్ లు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తారు.
సాంకేతిక విభాగం:
చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూనే చైల్డ్ ట్రాఫికింగ్ కథ తీయాలన్న స్వరూప్ ఐడియా కచ్చితంగా మెప్పిస్తుంది. కానీ సమస్య అంతా తెరకెక్కించడంతోనే ఉంది. అటు చిన్న పిల్లల పాత్రలు కానీ ఇటు తాప్సి పాత్ర కానీ సంపూర్ణంగా తీర్చిదిద్దిన భావన అయితే కలగదు.
మార్క్ కె రాబిన్ సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పిస్తాడు. ఈ థ్రిల్లర్ కు ఇదే బ్యాక్ బోన్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బడ్జెట్ కు లోబడి సాగాయి.
పాజిటివ్ పాయింట్స్:
- ముగ్గురు చిన్న పిల్లలు
- తాప్సి
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నెగటివ్ పాయింట్స్:
- సరైన డిటైలింగ్ లేకపోవడం
- డల్ ప్రెజంటేషన్
చివరిగా:
చైల్డ్ ట్రాఫికింగ్ ఇష్యూ మీద తీసిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్. ముగ్గురు చిన్న పిల్లలు చాలా బాగా చేసినా, తాప్సి మంచి సపోర్ట్ ఇచ్చినా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవ్వడంతో బిలో యావరేజ్ గా నిలుస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5