Andhra Pradesh: రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫార్చూన్ 500 కంపెనీ ‘సిఫీ’కు మంత్రి లోకేష్ ఆహ్వానించిన నేపథ్యంలో సిఫీ ఛైర్మెన్ అండ్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న కలుసుకుని కంపెనీ విస్తరణలో భాగంగా ఉన్న అవకాశాలపై చర్చించారు.
దేశంలో ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒక్కటిగా సిఫీ టెక్నాలజీస్ ఉంది. వివిధ నగరాల్లో ఉన్న అనేక కంపెనీలు, బ్యాంకులు, ఉత్తర అమెరికా, యూకె, సింగపూర్ లోని వివిధ కంపెనీలకు డేటా సర్వీసెస్ అందిస్తోందని మంత్రికి వివరించారు.
విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై ఇరువురూ చర్చించారు. ఈక్రమంలో రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలు, కొత్తగా తీసుకొచ్చిన ఐటీ పాలసీలను మంత్రి లోకేష్ సిఫీ ప్రతినిధులకు వివరించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో చర్చించి తదుపరి ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని సిఫీ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు.