త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలు..
- హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి ఆర్ధికసాయం
- నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ కు నిధులు
- పురపాలక శాఖ తరపున చేపడుతున్న ప్రాజెక్టులకు నిధులు
- ఇండస్ట్రియల్ క్యారిడార్ లోని 3 రోడ్లకు 6వేల కోట్లు
- హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక నడవాలకు 1500 కోట్లు
- కేపీహెచ్ బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకూ ప్రతిపాదిత ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ ప్రాజెక్టులో కేంద్రం 15 శాతం వాటాగా 450 కోట్లు
- వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టు వ్యయంలో 20 శాతంగా 184 కోట్లు..
- హైదరాబాద్ పరిసరాల్లో 104 మిస్సింగ్ లింక్ రోడ్ల కారిడార్లకు అయ్యే వ్యయంలో మూడో వంతుగా 800 కోట్లు
- ప్యారడైజ్ కూడలి నుంచి షామీర్ పేట ఓఆర్ఆర్ కూడలి, కండ్లకోయ వరకూ సిక్స్ లేన్ కు నిధులు.. కేటాయించాలని కోరారు.