వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి. స్వాతంత్ర సమరయోధుడిగా, విప్లవ వీరుడిగా అల్లూరి సాగించిన పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. అల్లూరి స్ఫూర్తితోనే ఎవరెన్ని కుట్రలుపన్నినా.. ప్రతికూలతలు ఎదురైనా సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. క్షత్రియుల కోసం సీఎం కేసీఆర్ మూడు ఎకరాల భూమిని కేటాయించారు. అధికారికంగా త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తాం’ అని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు చిన్నారులు అల్లూరి వేషధారణలో మెప్పించారు.