Switch to English

ఇది క్లియర్‌.. ఏపీలో ‘విద్యుత్‌ బిల్లుల’ షాక్‌లు తప్పవంతే.!

అది ఒక పూరి గుడిసె. మామూలుగా అయితే, నెలకి 200 రూపాయల బిల్లు కూడా వచ్చే పరిస్థితి వుండదు. కానీ, ఇప్పుడు ఏకంగా నాలుగు వేల రూపాయలకు పైన బిల్లు వచ్చిందట. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ కరెంట్‌ బిల్లు హల్‌చల్‌ చేస్తోంది. ఆ ఇంట్లో వుండే వృద్ధురాలే, ఆ బిల్లుని చూపిస్తూ వాపోతోంది. ఇలాంటి కథలు.. కాదు కాదు, విద్యుత్‌ బిల్లుల వ్యధలు రాష్ట్రంలో చాలానే కన్పిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కరోనా కష్ట కాలంలో పేదల నడ్డి విరిచేస్తోందంటూ విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి.

200 బిల్లు రావాల్సిన చోట, నాలుగు వేలు రావడమేంటి.? అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వుంది. కానీ, రాష్ట్ర ఆర్తిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వచ్చిందనీ, ఏప్రిల్‌ నెలలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్ళలోనే వుండడంతో విద్యుత్‌ బిల్లులు పెరిగిపోయానీ సెలవిచ్చారు. రెండు నెలలు మీటర్‌ రీడింగ్‌ తీయకపోవడంతో టారిఫ్‌ శ్లాబ్‌ మారి, బిల్లులు పెరిగాయనీ చెబుతున్నారాయన. మరోపక్క, అబ్బే.. రెండు నెలలకు శ్లాబ్‌ మార్చేయలేదు.. డివైడ్‌ చేసి, తదనుగుణంగానే బిల్లులు వేశామని అధికార యంత్రాంగం చెబుతున్న దరిమిలా.. ఏది నిజం.? అనేది మాత్రం అర్థం కావడంలేదు రాష్ట్ర ప్రజలకి.

ఓ చేత్తో రూపాయి విదిలించి, ఇంకో చేత్తో రెండ్రూపాయలు లాగేసుకోవడం ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. సంక్షేమ పథకాల అమలు మాటున, ప్రభుత్వాలు చేసే ‘జిమ్మిక్కులు’ ఇలాగే వుంటాయ్‌. 200 కరెంటు బిల్లు, 250 రూపాయలకో 300 రూపాయలకో పెరిగే అదో లెక్క. అంతేగానీ, వేలల్లో ఎలా పెరిగిపోతుంది.? ఏదన్నా సాంకేతిక సమస్య వుంటే జరగొచ్చు.. లేదంటే, ప్రభుత్వం అడ్డగోలుగా ఛార్జీల్ని పెంచేస్తే జరగొచ్చు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పష్టత రావడంలేదు. అధికారులు చెప్పేదొకటి, మంత్రులు చెప్పేది ఇంకొకటి కావడంతో.. రాష్ట్ర ప్రజానీకం ముందు ముందు ‘విద్యుత్‌ బిల్లుల షాకులు’ తప్పవా.? అన్న ఆవేదనతో బిక్కుబిక్కుమంటున్నారు. ‘ఇంటి వద్దనే వుంటున్నారు కదా.. వాడకం ఎక్కువైపోయింది..’ అంటూ సాక్షాత్తూ మంత్రిగారే వెటకారం చేస్తోంటే, రాష్ట్ర ప్రజలు తమ గోడు ఎవరితో చెప్పుకోవాలట కరెంటు బిల్లుల వాతకు సంబంధించి.?

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...

ఎన్టీఆర్‌కు అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును ఎన్టీఆర్‌కు కట్టబెట్టి నందమూరి ఫ్యాన్స్‌ సత్తా చాటారు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన...

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...