Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. పేరు వింటే అభిమానుల పెదాలపై నవ్వు.. కళ్లలో ఆనందం. తెరపై చూస్తే పూనకాలే వస్తాయి. దశాబ్దాలుగా అభిమానుల గుండెల్లో చిరంజీవి పెనవేసుకున్న బంధం అది. అసలు.. చిరంజీవికి అభిమానులు కాదు.. భక్తులే ఉంటారనేది సరైన మాట. దీనిని నిజం చేసి చూపిస్తున్నారు నుటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి.
ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో తన హోమ్ టూర్ వేశారాయన. ఇందులో భాగంగా ఓ అల్మారాలో తనకొచ్చిన బహుమతులు, షీల్డులు ఉన్నాయి. అక్కడే ఓ టీ కప్ ఉంది. దాని గురించి చెప్తూ.. ‘ఇది చిరంజీవిగారు టీ తాగిన కప్. ఓ సందర్భంలో కప్పులో సగం టీ తాగారు. మిగిలిన సగం తాగుతుంటే నేను తీసుకుని మిగిలిన సగం తాగేసి.. కప్ తెచ్చుకుని దాచుకున్నా’.
‘ఆయన మెగాస్టార్ కాబట్టి కప్పులో స్టార్ పెట్టుకున్నా. లక్ష రూపాయలు ఇచ్చినా కప్ ఇవ్వను. ఇది నాకెంతో అపురూప’మని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మెగాభిమానులు శివారెడ్డి అభిమానాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అన్నయ్య చిరంజీవి గారు తాగిన టీ కప్
అన్నయ్య సగం తాగారు నేను లాగేసుకొని మిగతా టీ నేను తాగి అందులో స్టార్ పెట్టి అలాగే గుర్తుగా పెట్టుకున్న ❤️💫
లక్ష ఇచ్చిన ఆ టీ కప్ ని ఇవ్వను 🙏🥺❤️
చిరంజీవి అభిమానులే వేరబ్బా ❤️💯🔥@KChiruTweets #ShivaReddy #MegastarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/CSCSfr1nOy
— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 6, 2024