రవిప్రకాష్ అంటే ఎవరు.? జర్నలిజానికి మకిలిపట్టించిన ఎర్నలిస్ట్.! టీవీ9 రవిప్రకాష్ కాస్తా, ఇప్పుడు రూపం మార్చుకుని, ఆర్టీవీ రవిప్రకాష్‌గా అవతారమెత్తాడు. కానీ, అదే ఎర్నలిజం.. అదే బ్లాక్‌మెయిల్ పాత్రికేయం.!
భారతీయ జనతా పార్టీలో బారత్ రాష్ట్ర సమితి విలీనం.. అంటూ ఓ సంచలనాత్మక వంటకాన్ని జనం ముందుంచారు రవిప్రకాష్, తన మీడియా సంస్థ ద్వారా. బీఆర్ఎస్ అంటే, వ్యక్తిగతంగా రవిప్రకాష్‌కి శతృత్వం వుందా.? ఏమో, వుందనే అనుకోవాలేమో.
టీవీ9 నుంచి రవిప్రకాష్‌ని గెంటేయడంలో బీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషించింది. అదీ రవిప్రకాష్ కడుపు మంట. నిజానికి, ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. రవిప్రకాష్, రాజకీయాల్ని శాసించాలనుకున్నాడు.. బ్లాక్‌మెయిల్ జర్నలిజమే చేశాడనేవారూ లేకపోలేదు.
ఇంతకీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా.? అసలు ఆ పరిస్థితులు వున్నాయా.? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు గల్లంతయ్యింది.. కానీ, పుంజుకుని.. అధికార పీఠమెక్కింది కదా.? ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకప్పుడు టీడీపీ పరిస్థితేంటి.? ఇప్పుడు టీడీపీ పరిస్థితేంటి.?
ఏమో, ముందు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా పుంజుకోవచ్చేమో. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల గురించి తెలియనిదెవరికి.? అవి రాజకీయాలు కావు, ముఠా తగాదాలని రవిప్రకాష్ లాంటి ఎర్నలిస్టులకు తెలియకుండా వుంటుందా.? బీజేపీ ఇందుకు మినహాయింపేమీ కాదు తెలంగాణలో.
ఇక్కడ బీఆర్ఎస్‌ని సమర్థించడమో, కాంగ్రెస్ అలాగే బీజేపీలను తక్కువ చేయడమో కాదు.. రవిప్రకాష్ మార్కు విశ్లేషణలు.. వాటి మాటున, బ్లాక్‌మెయిల్ ఎర్నలిజం గురించిన చర్చే ఇదంతా. ఆయన మారడు. మారడుగాక మారడు.!