Switch to English

పరిశ్రమకు పెద్దదిక్కుగా మారిన మెగాస్టార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. సినీ పరిశ్రమలో కలుపుకుని ముందుకెళుతూ సినీ కార్మికుల సంక్షేమానికి పాటుపడుతూ అందరివాడయ్యారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు పోషించిన పెద్దన్న పాత్రను ఇప్పుడు చిరు తన భుజానికెత్తుకున్నారు. దాసరి ఉన్నప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆయన దగ్గరకి వెళ్లేవారు. ఆయన కూడా పెద్ద మనసుతో అందరినీ ఆదరించేవారు. కానీ ఆయన మరణం తర్వాత ఆ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయాల్సి ఉందని పులువురు భావించారు. అది కూడా చిరంజీవి అయితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, చిరంజీవి ఇందుకు సుముఖత చూపిస్తారా లేదా అని సందేహించారు. కానీ చిరు తనంతట తానుగా ముందుకొచ్చారు. సాయం కావాల్సినవారికి సాయం అందించడం ప్రారంభించారు.

అనంతరం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్న లుకలుకలను సరిదిద్దడానికి పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులతో కలిసి ప్రయత్నాలు చేశారు. అలాగే చిన్న సినిమాల ప్రమోషన్లకు సహకరించడం, వివిధ సినిమా ఫంక్షన్లకు పిలిస్తే కాదనకుండా వెళ్లడం ద్వారా అందరికీ చేరువయ్యారు. తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులనూ అలరిస్తున్నారు.

ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం చిరంజీవి కూడా నడుంబిగించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ కమిటీ (సీసీసీ) ఏర్పాటు చేయడమే కాకుండా దానికి రూ.కోటి విరాళం ఇచ్చారు. అలాగే కరోనా సాంగ్ రూపొందించి, అందులో హీరోలు కనిపించాలన్న ఆలోచన కూడా చిరుదేనని చెబుతున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరపరచిన ఆ గీతంలో చిరంజీవితోపాటు నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కనిపించి సందడి చేశారు.

అంతేకాకుండా సినీ పరిశ్రమలో ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో తల్లడిల్లుతున్న కార్మికులకు ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఇతర పెద్దలతో చర్చించి ఆ మేరకు ముందుకెళ్తున్నారు. మొత్తానికి పరిశ్రమలో దాసరి నారాయణరావు లేని లోటును చిరంజీవి తీరుస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా అందరినీ కలుపుకుని వెళ్తుండటపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వివాద రహితుడు, మృదు స్వభావి అయిన చిరంజీవి ఈ కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ.. పరిశ్రమ సంక్షేమానికి పాటుపడుతుండటం నిజంగా అభినందనీయం. హ్యాట్సాఫ్ మెగాస్టార్..!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...