Balagam: మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా సరే ఆయన సింప్లిసిటీ ఎందరికో ఆదర్శం. ఏమాత్రం భేషజాలు లేకుండా, చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం చూపకుండా చిరంజీవి మంచి సినిమా వచ్చిన ప్రతీసారీ స్పందించారు.
రీసెంట్ గా కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన బలగం చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం. దిల్ రాజు సపోర్ట్ ఉన్న ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ పోషించారు. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గా బలగం చిత్రం చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆయన స్వయంగా బలగం టీమ్ ను కలిశారు. దర్శకుడు వేణు, హీరో హీరోయిన్లను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వేణు ఇంత సర్ప్రైజ్ చేస్తాడని అనుకోలేదని అన్నారు. అలాగే చిత్రం టీమ్ ను పేరుపేరునా పొగిడారు.
చిన్న సినిమాగా మొదలైన బలగం ప్రయాణం ఈరోజు మెగాస్టార్ ప్రశంసలతో మరింత బలం చేకూరిందని చెప్పాలి. ఇప్పటికే సూపర్ హిట్ స్టేటస్ అందుకున్న ఈ చిత్రం ఇంకా బలంగా ముందుకు పోతోంది.
429470 62243Hoping to go into business venture world-wide-web Indicates revealing your products or services furthermore companies not only to ladies locally, but nevertheless , to many prospective clients in which are online in most cases. e-wallet 942678
288238 111865We will provide deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to lose. 941326