‘సైరా నరసింహారెడ్డి’ లాంటి రియల్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ తన తదుపరి సినిమా బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి ఇది వరకే తెలిపాము. ప్రతి సినిమాలోనూ హీరో రేంజ్ ని బట్టి ఒక సోషల్ మెసేజ్ ని స్ట్రాంగ్ గా చెప్పే కొరటాల శివ ఈ సినిమాలో కూడా ఓ స్ట్రాంగ్ మెసేజ్ చెప్పనున్నాడు. అందుకే చిరు 152వ సినిమా కోసం రూరల్ బ్యాక్ డ్రాప్ ని సెలక్ట్ చేసుకున్నాడు.
152 వ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. కథా పరంగా ఓ మేజర్ ఎపిసోడ్ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఆ బ్యాక్ డ్రాప్ ట్రాక్ లో చిరంజీవి పవర్ఫుల్ నక్సలైట్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై కొరటాల శివ స్ట్రాంగ్ కంకెట్ ఇవ్వనున్నాడని సమాచారం. చిరు కెరీర్లో ఇలాంటి పాత్ర చేయకపోవడం వలన, తెరపై సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట.
ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. నవంబర్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ కానున్న ఈ సినిమాలో మొదటి 40 రోజుల షెడ్యూల్ ఈ సెట్లోనే జరగనుంది. ప్రస్తుతం చిరు సరసన నటించబోయే ఇద్దరు హీరోయిన్స్ కోసం అన్వేషణ జరుగుతోంది.
