Switch to English

Megastar Chiranjeevi: త్వరలో ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ – మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,824FansLike
57,786FollowersFollow

Megastar Chiranjeevi: త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్ ప్రారంభించి 10 ల‌క్ష‌ల యూనిట్స్ సేక‌రించి అవ‌స‌రార్థంలో ఉన్న పేద వారికి ర‌క్తాన్ని అందజేశారు. అలాగే, ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మందికి కార్నియా మార్పిడి చేయించడం ద్వారా తిరిగి కనుచూపు వచ్చేలా చేశారు.

క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికుల‌కు కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా సీసీసీని స్థాపించి ఇండ‌స్ట్రీ స‌హా ఇత‌రుల నుంచి విరాళాల‌ను సేక‌రించి కార్మికుల కుటుంబాల‌ను ఆదుకుని త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. అలాగే ఓ డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి వెళ్లిన‌ప్పుడు సినీ కార్మికులు, మీడియా ప్రతినిథులు స‌ద‌రు సెంట‌ర్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు 50 శాతం రాయితీని పొందేలా చేశారు. అలాగే ఇప్పుడు మ‌రోసారి సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద కొడుకుగా భుజం కాయ‌టానికి తానెప్పుడూ సిద్ధ‌మేన‌ని నిరూపించారు. శ‌నివారం ఓ క్యాన్స‌ర్ స్క్రీనింగ్ స్కాన్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి త‌న అభిమానుల‌కు, సినీ కార్మికుల‌కు క్యాన్స‌ర్ సంబంధిత స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేయాల‌ని అందుకు అయ్యే ఖ‌ర్చంతా ఏదైనా తాను భ‌రిస్తాన‌ని, అందుకు క్యాన్స‌ర్ సెంట‌ర్‌ వారు కూడా అందుకు అండ‌గా నిల‌బ‌డాల‌ని రిక్వెస్ట్ చేశారు. క్యాన్స‌ర్ వ‌ల్ల ఎంద‌రో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని , అయితే అవ‌గాహ‌న ఏర్పరుచుకుని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రైన చికిత్స‌లు చేయించుకోవ‌టం ద్వారా ప్రాథ‌మిక ద‌శ‌లోనే దాన్ని గుర్తించి నిరోధించ‌వ‌చ్చున‌ని చిరంజీవి తెలిపారు.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన స్టార్ క్యాన్స‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో స్టార్ హాస్పిట‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.గోపీచంద్ మ‌న్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…‘‘డాక్టర్స్ ఇచ్చే హ్యుమ‌న్ ట‌చ్ చాలా గొప్ప‌గా ఉంటుంది. ఈ రోజు స్టార్ క్యాన్స‌ర్‌ సెంట‌ర్ నా చేతుల మీదుగా ప్రాంభించ‌బ‌డ‌టం ఎంతో ఆనందంగా ఉంది. సాధార‌ణంగా మ‌నం అంద‌రం అనారోగ్యానికి గుర‌వుతున్నాం. మ‌రీ ముఖ్యంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో సామాన్యులు పోరాడుతున్నారు. గ‌త ఏడాది 19 ల‌క్ష‌లు మంది క్యాన‌ర్స్ బారిన ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లు.. ప‌రిస‌రాలు ఇలా ఏవైనా కావ‌చ్చు. అలాగే ప్ర‌జ‌ల్లోనూ క్యాన్స‌ర్ ప‌ట్ల ఎలాంటి అవ‌గాహ‌న లేక పోవ‌టం వ‌ల్ల ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.

క్యాన్స‌ర్‌ను ప్రాథ‌మిక స్టేజ్‌లో గుర్తిస్తే దాన్ని మ‌నం నివారించుకోవ‌చ్చు. నేను ఆరోగ్యంగా ఉంటాను. చ‌క్క‌టి ఆహారం తీసుకుంటాను అనే భావ‌న‌లో ఉంటాను. అలాంటి నేను కూడా ఈ మ‌ధ్య కాలంలో ఏఐజీ హాస్పిట‌ల్‌లో కొలొనో స్కోప్ టెస్ట్‌ తీసుకున్నాను. అందులో నాన్ క్యాన్స‌ర్ పాలిప్స్‌ను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వాటిని అలాగే వ‌దిలేస్తే అది క్యాన్స‌ర్‌గా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చున‌ని భావించి డాక్ట‌ర్స్ వాటిని తీసేశారు. ప్రాథ‌మికంగా గుర్తించ‌టం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. అవ‌గాహన అనేది లేక‌పోయుంటే ఇబ్బందిగా మారేదేమో. మ‌న చేతుల్లో ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న ఎంతో అవ‌స‌రం. ముందుగా ఆరోగ్య‌ప‌ర‌మైన మెడిక‌ల్ స్క్రీనింగ్ / స్కాన్ చేయించుకోవ‌టం ద్వారా క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారిని నిరోధించ‌వ‌చ్చు.

ఈ సంద‌ర్భంగా గోపీచంద్‌గారికి ఓ రిక్వెస్ట్‌.. క్యాన్స‌ర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు. చాలా మందికి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డికి వెళ్లాల‌నేది, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోవాల‌నేది తెలియ‌దు. సందిగ్ధంలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానుల‌కు గిఫ్ట్‌గా, భ‌రోసాగా మా చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌తో క‌లిసి మీరు అభిమానుల‌కు ఏదైనా చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే సినీ కార్మికుల్లో చాలా మంది పేద‌వాళ్లు ఉన్నారు. వారు కొండ‌న‌క‌, కోన‌న‌క‌, దుమ్ము, దూళిలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఎవ‌రికీ ఏ ర‌క‌మైన స‌మ‌స్య వస్తుందో తెలియ‌దు. ఊపిరితిత్తుల స‌మ‌స్య రావ‌చ్చు. ఇంకేదైనా రావ‌చ్చు. అలాంటి పేద‌వారికి ఏమైనా చేయ‌గ‌ల‌మా!, ముంద‌స్తుగా ఏమైనా క‌నిపెట్ట‌గ‌ల‌మా! స్క్రీనింగ్ టెస్టులులాంటివి ఏమైనా ఆయా జిల్లాలో చేస్తే.. ఆ ఖ‌ర్చు నేను భ‌రిస్తాను. మ‌నం అంద‌రం ప‌ర‌స్ప‌రం భ‌రించుకుందాం. దేవుడు నాకు కోట్లు ఇచ్చాడు. ఎన్ని కోట్లు అయినా నేను భ‌రించ‌గ‌ల‌ను. అవ‌కాశాలేమైనా ఉంటే ప‌రిశీలించండి’’ అన్నారు.

డా.గోపీచంద్ మ‌న్నం త‌ప్ప‌కుండా చిరంజీవి అభిమానుల‌కు, సినీ కార్మికుల కోసం క్యాన్స‌ర్‌ స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

‘పులగం’ ను అభినందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల...

Manchu Vishnu: భక్త కన్నప్పలో మరో స్టార్ హీరో..! మంచు విష్ణు...

Mohan lal: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భక్త కన్నప్ప (Bhakta Kannappa) సినిమాకు ఇటివల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ముందు...

Ram Charan: RC16.. రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించబోతున్న RC16కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్, అభిమానుల్లో హాట్ టాపిక్...

నాన్సెన్స్.! అక్కినేని నాగార్జునగారూ ఇదేం పద్ధతి.?

సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది. బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాదు కాదు, పడేశారు.!...

రాజకీయం

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు..! ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత

Prabhas: ప్రభాస్ (Prabhas) -రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అమరేంద్ర బాహుబలి పాత్రతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు....

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి గట్టి షాకే తగిలిందిగా

కశ్మీర్ ఫైల్స్ తో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాములు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దానికి 20 రెట్లు వసూలు చేసి నిర్మాతను లాభాల బాట...

రామ్ చరణ్… 16 సంవత్సరాలలో శిఖరాగ్రాలు అధిరోహించిన మెగా పవర్ స్టార్

తండ్రికి తగ్గ తనయుడు కాకుండా తండ్రిని మించే తనయుడిగా ఎదుగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఏర్పరిచిన ఫ్యాన్ బేస్ ను సంతృప్తిపరుస్తూ, ఆ ఇమేజ్ తాలూకా...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 27 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:52 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ త్రయోదశి రా.8:49 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ చతుర్దశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము:...

బిగ్ బాస్ 7: శివాజీ చుట్టూ కథ ఎందుకు నడుస్తోందబ్బా.?

‘నువ్వు బాధపడి వుంటే క్షమాపణ చెబుతున్నా..’ అంటూ రతిక రోజ్ మీద కొంత అసహనం వ్యక్తం చేశాడు శివాజీ.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఏడో సీజన్‌లో ‘పెద్దన్న’ తరహా పాత్రలో...