మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే తనకు నచ్చిన కథలను చేసుకుంటూ వెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ వాటి ఫలితాలతో అంత హ్యాపీగా లేలేక పోయినా ప్రయోగాలు చేయడం మాత్రం ఆపట్లేదు. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ కొత్త సినిమా లైలాతో వస్తున్నాడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రామ్ నారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు.
లైలా కోసం విశ్వక్ సేన్ లేడీ గెటప్ కూడా వేశాడని తెలిసిందే. ఈ తరం హీరోల్లో ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయలేరని చెప్పొచ్చు. విశ్వక్ లైలాగా మారేందుకు చాలా కష్టపడ్డాడు. ఇదిలాఉంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతున్న లైలా సినిమాకు సంబందించి త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ని ఇన్వైట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నిర్మాతకు సపోర్ట్ గా లైలా కోసం చిరు వస్తున్నారని తెలుస్తుంది. ఐతే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయితే మాత్రం లైలా ఈవెంట్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.