మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కష్టాల్లో ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీ వారికి తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. లక్షలకు లక్షల ఆర్థిక సాయం చేయడం చిరంజీవికి కొత్తేం కాదు. మరోసారి మెగాస్టార్ తన మెగా మనసును చాటుకున్నారు.
ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన దేవరాజ్ గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అద్దె ఇంట్లో జీవనాన్ని సాగిస్తూ అత్యంత గడ్డు పరిస్థితులతో జీవితాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యం కూడా సహకరించక పోవడంతో లేవడం కూడా ఇబ్బందిగా మారిందట.
దేవరాజ్ విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వారిని స్వయంగా కలిసి తక్షణ సాయంగా అయిదు లక్షల రూపాయల చెక్ ను అందించడం జరిగింది. నాగు.. రాణి కాసుల రంగమ్మ ఇంకా పులి బెబ్బులి సినిమాలతో పాటు పలు సినిమాలకు దేవరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. చిరు సాయంతో దేవరాజ్ ఆనందం వ్యక్తం చేశారు.